సందడి చేసిన విరాట్

లండన్: ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొంటున్న జట్ల కెప్టెన్ల కోసం ఐసిసి నిర్వహించిన డిన్నర్ భారత సారథి విరాట్ కోహ్లి సందడి చేశాడు. ఇంగ్లాండ్ కెప్టెన్ మోర్గాన్, సౌతాఫ్రికా సారథి డివిలియర్స్, బంగ్లాదేశ్ కెప్టెన్ ముర్తుజా తదితరులు ఈ డిన్నర్‌లో పాల్గొన్నారు. కాగా, ఈ కార్యక్రమంలో కోహ్లి చాలా సందడిగా కనిపించాడు. సహచర కెప్టెన్లతో చాలా నవ్వుతు మాట్లాడాడు. ఈ సందర్భంగా మీడియా సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు చిలిపిగా సమాధానాలు ఇచ్చాడు. మోర్గాన్‌తో కోహ్లి చాలా చనువుగా […]

లండన్: ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొంటున్న జట్ల కెప్టెన్ల కోసం ఐసిసి నిర్వహించిన డిన్నర్ భారత సారథి విరాట్ కోహ్లి సందడి చేశాడు. ఇంగ్లాండ్ కెప్టెన్ మోర్గాన్, సౌతాఫ్రికా సారథి డివిలియర్స్, బంగ్లాదేశ్ కెప్టెన్ ముర్తుజా తదితరులు ఈ డిన్నర్‌లో పాల్గొన్నారు. కాగా, ఈ కార్యక్రమంలో కోహ్లి చాలా సందడిగా కనిపించాడు. సహచర కెప్టెన్లతో చాలా నవ్వుతు మాట్లాడాడు. ఈ సందర్భంగా మీడియా సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు చిలిపిగా సమాధానాలు ఇచ్చాడు. మోర్గాన్‌తో కోహ్లి చాలా చనువుగా మెలిగాడు. డివిలియర్స్‌తో కూడా నవ్వులు పంచుకున్నాడు. కోహ్లి తీరు తమను ఎంతో ఆనందానికి గురి చేసిందని మోర్గాన్, డివిలియర్స్ అన్నారు. ఆటలో సీరియస్‌గా ఉండే కోహ్లి మ్యాచ్ తర్వాత సరదగా మారిపోతాడని డివిలియర్స్ అన్నాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు సహచరుడిగా తనకు కోహ్లి చాలా మంచి స్నేహితుడిగా మారాడన్నాడు.

Comments

comments

Related Stories: