సంజయ్ అరెస్టు

Sexual Allegations on Me with Political Conspiracy Said by Sanjay

నిజామాబాద్: డిఎస్ తనయుడు, మాజీ మేయర్ సంజయ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం సంజయ్‌ను  విచారించిన అనంతరం పోలీసులు అరెస్టు చేశారు. గతంలో లైంగిక వేధింపుల ఆరోపణలపై సంజయ్‌కు హాజరుకావాలని పోలీసులు నోటీసులు పంపిన విషయం తెలిసిందే.  ధర్మపురి   సంజయ్‌ తమను లైంగికంగా వేధిస్తున్నారని నిజామాబాద్‌లో శాంకరి నర్సింగ్‌ కళాశాల విద్యార్థినులు హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డికి ఆగస్టు 3వ తేదీన ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి అతడు అజ్ఞాతంలోకి వెళ్లిపోయన అనంతరం ఇవాళ ఉదయం ఎసిపి ఆఫీసుకు చేరుకున్నారు. నిజామాబాద్ నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ లో ఐపిసి 342, 354, 354ఏ,  సెక్షన్లతో పాటు సంజయ్ పై  నిర్భయ చట్టం కింద కేసులు నమోదైన విషయం విదితమే.

Comments

comments