సంగీత ప్రియులకు బెస్ట్ యాప్స్..

ఒత్తిడి, ఆవేదన నుంచి సైతం తగ్గించగల సామర్థ్యం కేవలం సంగీతానికి మాత్రమే ఉంది. మనం రోజు ఎన్నోరకాల మ్యూజిక్‌లను వింటుంటాం. మన చుట్టుపక్కల ప్లే అయ్యే మ్యూజిక్స్‌లో కొన్ని మ్యూజిక్స్ మనకు విపరీతంగా నచ్చేస్తుంటాయి. ఆ లిరిక్స్ ఎక్కడివో తెలుసుకుని మళ్లీమళ్లీ వినాలనిపిస్తుంటుంటుంది. మనకు తెలియని మ్యూజిక్ ఏదైనా ప్లే అవుతున్నప్పుడు మన చేతిలోని ఆండ్రాయిడ్ ఫోన్ ద్వారా ఆ మ్యూజిక్‌ను ఐడెంటిఫై చేసి అదే మ్యూజిక్‌ను మన ఫోన్‌లోనూ మళ్లీ వినవచ్చు. మ్యూజిక్‌ను ఐడెంటిఫై చేసేందుకుగాను […]

ఒత్తిడి, ఆవేదన నుంచి సైతం తగ్గించగల సామర్థ్యం కేవలం సంగీతానికి మాత్రమే ఉంది. మనం రోజు ఎన్నోరకాల మ్యూజిక్‌లను వింటుంటాం. మన చుట్టుపక్కల ప్లే అయ్యే మ్యూజిక్స్‌లో కొన్ని మ్యూజిక్స్ మనకు విపరీతంగా నచ్చేస్తుంటాయి. ఆ లిరిక్స్ ఎక్కడివో తెలుసుకుని మళ్లీమళ్లీ వినాలనిపిస్తుంటుంటుంది. మనకు తెలియని మ్యూజిక్ ఏదైనా ప్లే అవుతున్నప్పుడు మన చేతిలోని ఆండ్రాయిడ్ ఫోన్ ద్వారా ఆ మ్యూజిక్‌ను ఐడెంటిఫై చేసి అదే మ్యూజిక్‌ను మన ఫోన్‌లోనూ మళ్లీ వినవచ్చు. మ్యూజిక్‌ను ఐడెంటిఫై చేసేందుకుగాను అనేక యాప్స్ మార్కెట్లో ఉన్నాయి. అలాంటి వాటిలో కొన్ని బెస్ట్ యాప్స్‌ను చూద్దాం….

మ్యూజిక్స్‌మ్యాచ్‌లిరిక్స్ & మ్యూజిక్ (Musixmatch Lyrics & Music) :
లిరిక్స్‌ను క్యాచ్ చేసేందుకు ఇదొక బెస్ట్ యాప్. కొన్ని లక్షల పాటలకు సంబంధించిన లిరిక్స్ క్యాట్‌లాగ్ మ్యూజిక్స్‌మ్యాచ్ యాప్‌లో అందుబాటులో ఉంటుంది. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఈ యాప్‌ను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

సౌండ్‌క్లౌడ్ మ్యూజిక్ & ఆడియో (SoundCloud – Music & Audio) :
మార్కెట్లో లభ్యమవుతోన్న అత్యుత్తమ మ్యూజిక్ రికగ్నిషన్ యాప్‌లలో సౌండ్‌క్లౌడ్ – మ్యూజిక్ , ఆడియో ఒకటి. సౌండ్‌క్లౌడ్ యాప్‌ను ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది యూజర్లు ఉపయోగించుకుంటున్నారు.
షాజమ్ (Shazam) : సంగీత ప్రియులు ఎంతగానో అభిమానిస్తోన్న యాప్‌లలో షాజమ్ ఒకటి. ఈ యాప్‌ను ప్రపంచవ్యాప్తంగా 10 కోట్లకు పైగా యూజర్లు వినియోగించుకుంటున్నారు. లిరిక్స్‌ను క్యాచ్ చేసేందుకు ఇదొక బెస్ట్ యాప్. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఈ యాప్‌ను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

సౌండ్‌హౌండ్ మ్యూజిక్ సెర్చ్ (SoundHound Music Search) :
గూగుల్ ప్లే స్టోర్‌లో సందడి చేస్తోన్న ఈ మ్యూజిక్ సెర్చ్ యాప్ యూజర్లకు హైక్వాలిటీ డిస్కవరీ ఎక్స్‌పీరియన్స్‌ను ఆఫర్ చేస్తుంది. యాప్‌ను ఓపెన్ చేసి స్క్రీన్ పై కనిపించే ఆరెంజ్ బటన్ పై క్లిక్ చేసినట్లయితే, మీకు దగ్గరలో ప్లే అవుతోన్న మ్యూజిక్ ఇన్‌స్టెంట్‌గా ఐడెంటిఫై కావటంతో పాటు లిరిక్స్ కూడా స్క్రీన్ పై డిస్‌ప్లే అవుతాయి.

ట్రాక్‌ఐడీ (TrackID) :
మార్కెట్లో లభ్యమవుతోన్న అత్యుత్తమ మ్యూజిక్ రికగ్నిషన్ యాప్‌లలో ట్రాక్‌ఐడీ ఒకటి. ఈ మ్యూజిక్ సెర్చ్ యాప్ యూజర్లకు హైక్వాలిటీ డిస్కవరీ ఎక్స్‌పీరియన్స్‌ను ఆఫర్ చేస్తుంది. యాప్‌ను ఓపెన్ చేసి స్క్రీన్ పై కనిపించే ట్రాక్‌ఐడీ బటన్ పై క్లిక్ చేసినట్లయితే సెకన్ల వ్యవధిలో మీకు దగ్గరలో ప్లే అవుతోన్న మ్యూజిక్ ఐడెంటిఫై కాబడుతుంది.

Comments

comments