సంక్షేమ పథకాలే దయాకర్‌ ను గెలిపిస్తాయి: ఎంఎల్ఏ రాజయ్య

ధర్మసాగర్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. శుక్రవారం ధర్మసాగర్ మండల కేంద్రం,   వేలేరు మండల కేంద్రం,  మల్లికుదుర్ల,  పీచర గ్రామాలల్లో ఎమ్మెల్యే రాజయ్య, టిఆర్ఎస్ ఎంపి అభ్యర్థి పసునూరి దయాకర్‌లకు మహిళలు కుంకుమ తిలకం దిద్ది కోలాటాలతో స్వాగతం పలికారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మేల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య, ఎంపి అభ్యర్ధి పసునూరి దయాకర్, […] The post సంక్షేమ పథకాలే దయాకర్‌ ను గెలిపిస్తాయి: ఎంఎల్ఏ రాజయ్య appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ధర్మసాగర్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. శుక్రవారం ధర్మసాగర్ మండల కేంద్రం,   వేలేరు మండల కేంద్రం,  మల్లికుదుర్ల,  పీచర గ్రామాలల్లో ఎమ్మెల్యే రాజయ్య, టిఆర్ఎస్ ఎంపి అభ్యర్థి పసునూరి దయాకర్‌లకు మహిళలు కుంకుమ తిలకం దిద్ది కోలాటాలతో స్వాగతం పలికారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మేల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య, ఎంపి అభ్యర్ధి పసునూరి దయాకర్, హజరై ఏర్పాటు చేసిన సమావేశంలో రాజయ్య మాట్లాడుతూ టిఆర్‌ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉన్న పార్టీ అని అన్నారు. ధర్మసాగర్, వేలేరు మండలాల్లోని అన్ని గ్రామాల చెరువులు ఎప్పుడు నిండుకుండలా నీళ్ళు ఉంటాయన్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్ రైతులకు పెట్టుబడి సాయానికి రైతు బంధు పథకం కింద రూ.8వేల నుండి రూ.10వేలు చేసిన ఘనత కేసిఆర్‌కే దక్కుతుందన్నారు. ప్రజా పక్షపాతి మన కెసిఆర్ అని అన్నారు.

ప్రజలకు ఆసరా పింఛన్, కళ్యాణలక్ష్మీ, చిన్నపిల్లలకు కేసిఆర్‌కిట్టు, రైతులకు జీవితభీమా మరెన్నో అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టి తెలంగాణ ప్రజలను ఆదుకున్న వ్యక్తి కెసిఆర్ అని కొనియాడారు. పార్లమెంట్ ఎన్నికల్లో టిఆర్‌ఎస్ ఎంపి అభ్యర్ధి పసునూరి దయాకర్‌కి ఓటు వేసి లక్ష మెజార్టీతో గెలిపించి కెసిఆర్‌కి బహుమతిగా ఇవ్వాలని ఆయన ప్రజలను కొరారు. అనంతరం ఎంపి అభ్యర్ధి పసునూరి దయాకర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కెసిఆర్‌తోనే అన్ని రంగాల్లో అభివృద్ధి జరిగిందన్నారు. మీరందరు కారు గుర్తుకు ఓటు వేసి నన్ను ఆశీర్వదించాలని కొరారు. ఈ కార్యక్రమంలో ధర్మసాగర్, వేలేరు మండలాల అధ్యక్షులు గుడివెనుక దేవేందర్, గుజ్జుల రాంగోపాల్‌రెడ్డి, జడ్పిటీసి వెంకటేశ్వర్లు, టిఆర్‌ఎస్ నేత కన్నెబొయిన రాజయ్యయాదవ్, ధర్మసాగర్ గ్రామ సర్పంచ్ ఎర్రబెల్లి శరత్, బొడ్డు ప్రభుదాసు, బేరే వీరన్న, బొడ్డు బాలు, మండల ప్రజా ప్రతినిధులు, నిమ్మ కవిత, హహిళ సంఘాలు, ఆయా గ్రామాల సర్పంచులు, అన్ని గ్రామాల టిఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు గ్రామ ప్రజలు తదితరులు పాల్గోన్నారు.

 

MLA dr rajaiah speech at TRS election Campaign

 

 

 

Related Images:

[See image gallery at manatelangana.news]

The post సంక్షేమ పథకాలే దయాకర్‌ ను గెలిపిస్తాయి: ఎంఎల్ఏ రాజయ్య appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: