సంక్రాతికి ‘సై’

ఏజెన్సీలో మొదలైన సంక్రాంతి సందడి జోరుగా కోడి పందేలు పలు రకాల పందెం కోళ్లు సిద్ధమైన వేదికలు,లక్షల్లో బెట్టింగులు ఆదేశాలు భేఖాతర్…  కోడి పందాల నిర్వహణ చట్ట రీత్యా నేరం, సరదా కోసం మూగ జీవాల ప్రాణాలతో ఆటలాడటం సరైంది కాదని దీనిపై నిషేదాన్ని పెట్టారు. కానీ కార్లులో సైతం కోడి పుంజులతో దిగి బస్తాల కోద్దీ డబ్బులు వెచ్చించి పందేల్లో పాల్గోంటుంటారు. కోడి పందేలను నిర్వహిస్తే చట్ట పరమైన కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నప్పటికీ […]

ఏజెన్సీలో మొదలైన సంక్రాంతి సందడి
జోరుగా కోడి పందేలు
పలు రకాల పందెం కోళ్లు
సిద్ధమైన వేదికలు,లక్షల్లో బెట్టింగులు

ఆదేశాలు భేఖాతర్… 

కోడి పందాల నిర్వహణ చట్ట రీత్యా నేరం, సరదా కోసం మూగ జీవాల ప్రాణాలతో ఆటలాడటం సరైంది కాదని దీనిపై నిషేదాన్ని పెట్టారు. కానీ కార్లులో సైతం కోడి పుంజులతో దిగి బస్తాల కోద్దీ డబ్బులు వెచ్చించి పందేల్లో పాల్గోంటుంటారు. కోడి పందేలను నిర్వహిస్తే చట్ట పరమైన కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నప్పటికీ ప్రతీ ఏటా ఈ తంతు యధావిధిగా కోనసాగుతూనే ఉంది.

సంక్రాతి సీజన్‌లో కోడి పందేలను అరికట్టడం పోలీసులకు కత్తిమీద సాములాగే మారింది. ప్రతీ సారి పందేలు నిర్వహించే స్థావరాలపై దాడులు చేసి కోళ్లతో పాటు సెల్‌ఫోన్లు, వాహనాలు స్వాదీనం చేసుకుని నిర్వాహకులు, జూదగాళ్లపై కేసులు పెడుతున్నప్పటికీ పరిస్థితిలో ఏ మాత్రం మార్పు రావడం లేదు. జూదాన్ని అరికట్టేందుకు ప్రజల సహాయ సహకారాలు కావాలని పోలీసులు మోత్తుకుంటున్నప్పటికీ పట్టించుకునే నాధుడే లేడు.

ఇప్పటికైనా ప్రజలు చైతన్యవంతులై అనాగరిక చర్యలకు దూరంగా ఉండి జూదాన్ని అరికట్టేందుకు సహకరించాలని పోలీసులు కోరుతున్నారు. మరో ప్రక్క ఆ శాఖలోని కోందరు జూదానికి సహకరిస్తున్నారనే విమర్శలు సైతం వెల్లువెత్తుతున్నాయి. పందేలు నిర్వహించే క్రమంలో పట్టుపడితే కోద్దిపాటి జరిమానాలు విధించి వదిలేయడం వల్ల జూదగాళ్లు సైతం సులువుగా తీసుకుంటున్నారు.

భద్రాచలం : భద్రాచలం ఏజెన్సీలో సంక్రాంతి సందడి ప్రారంభమైంది. సంక్రాంతిని పురస్కరించుకుని సరదగా జరుపుకునే కోడి పందేలు ఇప్పుడు పెద్ద జూదంగా మారాయి. భద్రాచలం డివిజన్లోని ఐదు మండలాలతో పాటు ఏపిలో మండలాల్లో సైతం కోడి పందేలా జోరు షుషారుగా సాగుతోంది. ఈ కోడి పందేల పుణ్యమా అని లక్షల రూపాయలు దగలేసుకుని ఇల్లు, ఓల్లు ప్రతీ ఏటా గుల్ల చేసుకుంటున్నారు. సంక్రాంతి సీజన్ వచ్చిందంటే గ్రామాల్లో లక్షల్లో ఆటలు సాగుతుంటాయి. భద్రాచలం పట్టణ శివారు ప్రాంతాలైన తుమ్మలనగర్, గుండాల కాలనీ, ఆదర్శనగర్ తో పాటు దుమ్ముగూడెం, మారాయిగూడెం, చర్ల మండలాలతో పాటు పక్కనే ఉన్న భూపాలపల్లి జిల్లాలోని వెంకటాపురం, వాజేడు మండలాల్లో కోడి పందేలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

లక్షల్లో బెట్టింగ్‌లు…

కోడి పందేలు లక్షల బెట్టింగ్‌లో నడు స్తుంటాయి. ఇందు కోసం సుమారు రూ.10 వేల నుంచి రూ.50 వేల విలువ గల కోడి పుంజులను ముందు
గానే కోనుగోలు చేసి పందేం కోసం సిద్ధం చేస్తారు. పందేం కోసం సిద్ధం చేసే పుంజుకు అందించే ఆహారం విషయంలో కూడా పెద్ద ఎత్తున నియ
మాలు పాటిస్తారు. నానబెట్టిన జోన్నలు, రాగులు, జీడి పప్పు, బాదంపప్పు వంటివి అందిస్తారు. పుంజు ఎక్కువ సేపు భరిలో ఉండి పోరాడేందుకు
కసరత్తు చేయిస్తారు. బావులు, చెరుపుల్లో ఈత కోట్టిస్తారు. కోడి పంజును పూర్తిగా నీళ్లలో తడిపి సన్నని తీగమీద రాత్రంతా ఉంచుతారు. ఇలా కసరత్తులు చేయించి గెలుపుకోసం లక్షల రూపాయలు పట్టుకుని బరిలోకి దిగుతారు జూదగాళ్ళు. కోడి పందేల స్థావరాల వద్ద మందు, మాంసం విక్రయాలుసైతం జోరుగా సాగుతుంటాయి.

పందెం కోళ్లు పలు రకాలు…

పందెం లోకి దింపే కోళ్లకు వాటి రూపాన్ని బట్టి పలు రకాలు పేర్లు పెడుతుంటారు. కోళ్లు బరిలో ఉన్నప్పుడు కూడా దాని ఆకరం, రంగును బట్టి బెట్టింగ్‌లు పెడుతుంటారు. కాకి,డేగ, తెల్లనెమలి, పూలనెమలి, నెమలి, గౌడపర్ల, గేరువ, రసంగి, సీతువ, పెట్టమారి, అబ్రాసు వంటి పేర్లతో పిలుస్తుంటారు. అంతే కాకుండా ఈకల రంగులను బట్టి కూడా పేర్లు పెట్టి పిలుస్తుంటారు. బరిలో ఉన్న కోడి పుంజల కాళ్లకు కత్తులు కడుతున్నప్పుడు అక్కడి పరిస్థితి రసవత్తరంగా ఉంటుంది.

Related Stories: