షూటింగ్‌లో రెండో స్వర్ణం

ఆసియాడ్స్‌లో రాహీ సరనోబత్ రికార్డు స్వర్ణం సాధించిన తొలి భారతీయ మహిళా షూటర్ పలేంబాంగ్: ఆసియా క్రీడల్లో బుధవారం స్వర్ణ పతకాన్ని సాధించిన తొలి భారతీయ మహిళా షూటర్‌గా రాహీ సరనోబత్ నిలిచింది. 26 మీ. పిస్టల్ ఫైనల్స్‌లో రోమాంచకంగా ఉన్న పోటీలో ఆమె ఈ అరుదైన ఫీట్‌ను సాధించింది. 27 ఏళ్ల రహీ థాయ్‌లాండ్‌కు చెందిన నఫస్వాన్ యాంగ్‌పైబూన్ చెరో 34 పాయింట్లు సమం చేశారు. 10 సిరీస్‌లో ఐదేసి షాట్లు ఇద్దరూ గెలిచారు. దీంతో […]

ఆసియాడ్స్‌లో రాహీ సరనోబత్ రికార్డు
స్వర్ణం సాధించిన తొలి భారతీయ మహిళా షూటర్

పలేంబాంగ్: ఆసియా క్రీడల్లో బుధవారం స్వర్ణ పతకాన్ని సాధించిన తొలి భారతీయ మహిళా షూటర్‌గా రాహీ సరనోబత్ నిలిచింది. 26 మీ. పిస్టల్ ఫైనల్స్‌లో రోమాంచకంగా ఉన్న పోటీలో ఆమె ఈ అరుదైన ఫీట్‌ను సాధించింది. 27 ఏళ్ల రహీ థాయ్‌లాండ్‌కు చెందిన నఫస్వాన్ యాంగ్‌పైబూన్ చెరో 34 పాయింట్లు సమం చేశారు. 10 సిరీస్‌లో ఐదేసి షాట్లు ఇద్దరూ గెలిచారు. దీంతో పోటీ రోమాంచకంగా మారింది. అంతేకాక షూట్‌ఆఫ్ దశకు వెళ్లింది. షూట్ ఆఫ్‌లో ఇద్దరికీ లక్షాన్ని నాలుగుసార్లు గెలిచారు. దాంతో మరోసారి షూట్ ఆఫ్ ఏర్పడింది. దాంట్లో రాహీ మూడు, థాయ్‌లాండ్ షూటర్ రెండు గెలిచింది. దీంతో కొల్హాపూర్‌కు చెందిన షూటర్ రాహీకి చారిత్రక ఖ్యాతి లభించింది.

ఈ పోటీలో రజత పతకం దక్షిణ కొరియాకు చెందిన కిమ్ మిన్‌జుంగ్‌కు దక్కింది. ఫైనల్ షూటింగ్‌లో రహీయే ఎక్కువ ఆధిక్యతను ప్రదర్శించింది. తొలి 10 షాట్లు లక్షంపై ఖచ్చితంగా షూట్ చేసింది. ఆరో సీరిస్‌లోనైతే ఐదింట ఐదు షూట్ చేసింది. ఆసియా క్రీడల్లో రాహీ తన ఈ ప్రదర్శనతో భారత్‌కు స్వర్ణం సాధించిన రెండో క్రీడాకారిణి అయింది. 16 ఏళ్ల సౌరభ్ చౌదరి మంగళవారం 10 మీ. ఎయిర్ పిస్టల్ ఫైనల్స్‌లో భారత్‌కు తొలి స్వర్ణాన్ని సాధించాడన్నది తెలిసిన విషయమే. 2013లో వరల్డ్ కప్‌లో స్వర్ణాన్ని సాధించిన తొలి పిస్టల్ షూటర్‌గా నిలిచిన రాహీకి గత ఏడాది మోచెయ్యి గాయమైంది. తన టెక్నిక్‌లో మార్పు అవసరమని తలచిన ఆమె ఒలింపిక్‌లో రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన జర్మనీకి చెందిన మున్‌ఖబయర్ డోర్జ్‌సురేన్ వద్ద శిక్షణ తీసుకుంది. రాహీ ఇదివరలో 2010లో ఢిల్లీ కామన్వెల్త్ క్రీడల్లో డబుల్ గోల్డ్ మెడలిస్టుగా, 2014 ఆసియా క్రీడల్లో 25 మీ. పిస్టల్ పెయిర్స్‌లో రజత పతక విజేతగా నిలిచింది.

Comments

comments

Related Stories: