తిరువనంతపురం : మలయాళ భామ , ప్రముఖ నటి అమలాపాల్ షూటింగ్లో గాయపడింది. యాక్షన్ సీక్వెన్స్ తీస్తున్న సమయంలో ఆమె కుడి చేయికి గాయమైంది. ఈ ఘటన అధో అంధ పరవై పోలా చిత్ర షూటింగ్లో జరిగింది. గాయంతోనే షూటింగ్లో పాల్గొనాలని అమలా పాల్ భావించారు. కానీ నొప్పి తీవ్రం కావడంతో షూటింగ్‌ను క్యాన్సిల్ చేసుకుంది. ప్రస్తుతం ఆమె కేరళలో చికిత్స తీసుకుంటుంది. వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని ఆమెకు వైద్యులు సూచించారు.