షాట్‌పుట్‌లో భారత్‌కు పసిడి పతకం

జకార్తా: ఇండోనేషియా వేదికగా జరుగుతున్న 18వ ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారుల పతకాల వేట కొనసాగుతోంది. తాజాగా భారత్ ఖాతాలో ఏడో స్వర్ణం వచ్చి చేరింది. షాట్‌పుట్‌లో తూర్‌ తజిందర్‌పాల్‌ సింగ్‌ పసిడి పతకం గెలిచారు. శనివారం జరిగిన పురుషుల షాట్‌పుట్‌ విభాగంలో తజిందర్‌పాల్‌ సింగ్‌ స్వర్ణ పతకం కైవసం చేసుకున్నాడు. తజిందర్‌పాల్‌ గుండును ఏకంగా 20.75 మీటర్లు విసిరి ఆసియా క్రీడల్లో కొత్త రికార్డు సృష్టించాడు. ఐదో ప్రయత్నంలో అతడు ఈ ఘనత సాధించాడు. దీంతో ఇండియాకు అథ్లెటిక్స్‌లో తొలి స్వర్ణం అందించాడు. అలాగే భారత్ పతకాల […]

జకార్తా: ఇండోనేషియా వేదికగా జరుగుతున్న 18వ ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారుల పతకాల వేట కొనసాగుతోంది. తాజాగా భారత్ ఖాతాలో ఏడో స్వర్ణం వచ్చి చేరింది. షాట్‌పుట్‌లో తూర్‌ తజిందర్‌పాల్‌ సింగ్‌ పసిడి పతకం గెలిచారు. శనివారం జరిగిన పురుషుల షాట్‌పుట్‌ విభాగంలో తజిందర్‌పాల్‌ సింగ్‌ స్వర్ణ పతకం కైవసం చేసుకున్నాడు. తజిందర్‌పాల్‌ గుండును ఏకంగా 20.75 మీటర్లు విసిరి ఆసియా క్రీడల్లో కొత్త రికార్డు సృష్టించాడు. ఐదో ప్రయత్నంలో అతడు ఈ ఘనత సాధించాడు. దీంతో ఇండియాకు అథ్లెటిక్స్‌లో తొలి స్వర్ణం అందించాడు. అలాగే భారత్ పతకాల సంఖ్య 29కి చేరింది. వీటిలో ఏడు స్వర్ణాలు, ఐదు రజతం, 17 కాంస్యం ఉన్నాయి.

Comments

comments

Related Stories: