శ్రీ జోగులాంబ దేవి అమ్మవారి.. నిజరూప దర్శనంతో జన్మ ధన్యమైంది

1001 కలశాలతో  అమ్మవారికి పూజ ఘనంగా అమ్మవారి  బ్రహ్మోత్సావాలు చంఢీ హోమంలో శ్రీ ఆంజనేయ ప్రతిరూపం చివరి రోజు బ్రహ్మోత్సవంలో.. పోటెత్తిన భక్త జనసందోహం అమ్మవారి కలశ పూజలో  రాష్ట్ర ఎన్నికల కమిషనర్ బన్వర్‌లాల్ దంపతులు అలంపూరు: అష్టాదశ పీఠాలలో 5వ శక్తీ పీఠం శ్రీ జోగులాంబ దేవి బ్రహ్మోత్సావాలలో 12 సంవ త్సారాలకు ఒకసారి దర్శనమిచ్చే అమ్మవారి నిజరూప దర్శనంతో జన్మధన్యమైందని భక్తులు ఆనందోత్సాహంతో ఊగిపోయారు. బుదవారం అమ్మవారి బ్రహ్మోత్సావాల లో చివరి రోజు కావడంతో […]

1001 కలశాలతో  అమ్మవారికి పూజ
ఘనంగా అమ్మవారి  బ్రహ్మోత్సావాలు
చంఢీ హోమంలో శ్రీ ఆంజనేయ ప్రతిరూపం
చివరి రోజు బ్రహ్మోత్సవంలో.. పోటెత్తిన భక్త జనసందోహం
అమ్మవారి కలశ పూజలో  రాష్ట్ర ఎన్నికల కమిషనర్
బన్వర్‌లాల్ దంపతులు

అలంపూరు: అష్టాదశ పీఠాలలో 5వ శక్తీ పీఠం శ్రీ జోగులాంబ దేవి బ్రహ్మోత్సావాలలో 12 సంవ త్సారాలకు ఒకసారి దర్శనమిచ్చే అమ్మవారి నిజరూప దర్శనంతో జన్మధన్యమైందని భక్తులు ఆనందోత్సాహంతో ఊగిపోయారు. బుదవారం అమ్మవారి బ్రహ్మోత్సావాల లో చివరి రోజు కావడంతో వివిధప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

ఉదయం 8:30 గంటల నుంచే భక్తులు అధిక సంఖ్యలో చేరుకున్నారు. మొదట 1001 కలశాలతో, చండీహోమాలతో అమ్మవారికి పూజ లు ప్రారంబమయ్యాయి. ఈ పూజలకు ఎన్నికల కమీషన ర్ బన్వర్‌లాల్ దంపతులు హజరై శ్రీ జోగులాంబదేవి అమ్మవారికి అభిషేకం చేయాడానికి కలశాలను తీసుకు వచ్చారు. అనంతరం ఆలయంలో వేద పండితుల మంత్రో చ్చారణల మధ్య అమ్మవారి నిజరూప విగ్రహానికి పంచా మృతాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం ఎన్ని కల కమీషనర్ దంపతులకు అమ్మవారి పట్టు వస్త్రాలను, గాజులను ఆలయ ఈఓ గురురాజ , ప్రధాన అర్చకులు అందజేశారు.

చంఢీ హోమంలో ఆంజనేయ ప్రతిరూపం: శ్రీ జోగులాం బ దేవి అమ్మవారి ఆలయంలో ప్రధాన అర్చకులు వేద మంత్రోచ్చారనల మధ్య నిర్వహిస్తున్న చంఢీ హోమంలో శ్రీ ఆంజనేయ ప్రతి రూపం కనబడింది. దీంతో భక్తులు ఆనందం వ్యక్తం చేశారు. ఇలా రావడం చాలా అరుదని ఆలయ అర్చకులు అన్నారు. ఈ కలశా పూజ, అమ్మవారి అభిషేకం పూజ కార్యక్రమంలో ఆర్డీఓ అబ్దుల్‌హమీద్, ల య కార్యనిర్వహణాధికారి గురురాజ, అలంపూరు నాయ బ్ తహసీల్దార్ వరలక్ష్మీ, గిర్దావర్ మనోహర్, అలంపూరు ఎస్‌ఐ పర్వతాలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.