శ్రీవారి ఆలయంలో మహాసంప్రోక్షణ…

Vaikunta Ekadasi Celebrations

తిరుపతి: తిరుమలలోని శ్రీవారి ఆలయంలో శనివారం  మహాసంప్రోక్షణ ప్రక్రియ ప్రారంభమైంది. శ్రీవారం ఆలయంలో వైదికంగా రుత్వీక వరణం కార్యక్రమం నిర్వహణ జరుగుతుంది. ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు అధ్వర్యంలో 44 మంది రుత్వికులు, 100 మంది వేదపండితులు, 20 మంది వేదపారాయణదారులు మహాసంప్రోక్షణ కార్యక్రమం లో పాల్గొన్నారు. లోకకళ్యాణం కోసం వైదికంగా 12 ఏళ్ళకోసారి నిర్వహించే అష్టభంధన, బాలాలయ, మహాసంప్రోక్షణ వైష్ణవ ఆగమసాంప్రదాయానుసారంగా జరుగుతుంది. మహాసంప్రోక్షణ కోసం శ్రీవారిఆలయంలో 18 వేదికలపై కుం భాలు, 28 హోమగుండాలను ఏర్పాటు చేశారు. 8 రకాల ద్రవ్యాలతో అష్టబంధనం లేపనం తయారుచేస్తారు. ఆలయంలో శ్రీవారిగర్బాలయంతో పాటు ఉప ఆలయాలు, గోపురాలు అన్నింటికీ పునరుత్తేజ శక్తిని ఆవాహన చేయడాన్నే మహాసంప్రోక్షణలో ప్రదానఘట్టంగా పేర్కొంటారు. మహాసంప్రోక్షణ దృష్ట్యా స్వామివారి దర్శనానికి పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతిస్తున్నారు. శ్రీవారి సర్వదర్శనం మినహా అన్ని రకాల దర్శనాలు, ఆర్జిత సేవలు రద్దయ్యాయి. ప్రస్తుతం శ్రీవారి సాధారణ సర్వదర్శనానికి ఆరు కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శుక్రవారం శ్రీవారిని 48,978 మంది భక్తులు దర్శించుకోగా 14,879 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.49 కోట్లుగా ఉందని టిటిడి అధికారులు వెల్లడించారు.

Comments

comments