శ్రీవారి ఆలయంలో పెరిగిన భక్తుల రద్దీ

Devotees Rush in Tirumala Temple on Monday

తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయంలో సోమవారం భక్తుల రద్దీ పెరిగింది. వైకుంఠంలోని అన్ని కంపార్ట్‌మెంట్లు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఈ క్రమంలో వైకుంఠం వెలుపల భక్తులు భారీగా బారులు తీరారు. శ్రీవారి సర్వదర్శనానికి 22 గంటల సమయం పడుతోంది. టైమ్‌స్లాట్ టోకెను పొందిన భక్తులకు 3గంటల సమయం పడుతోంది. ఆదివారం శ్రీవారిని 88,099 మంది దర్శించుకున్నారు. 39, 463 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. ఆదివారం శ్రీవారి హుండీకి రూ.3.01 కోట్ల ఆదాయం సమకూరింది. ఆలయంలో భక్తుల రద్దీ దృష్టా అన్ని ఏర్పాట్లు చేసినట్టు టిటిడి అధికారులు తెలిపారు.

Devotees Rush in Tirumala Temple on Monday

Comments

comments