శ్రీవారిని దర్శించుకున్న కడియం

తిరుమల : తెలంగాణ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి తన కుటుంబంతో కలిసి ఆదివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. శ్రీవారి దర్శనం అనంతరం కడియం కుటుంబానికి రంగనాయకుల మండపంలో ఆలయ పండితులు ఆశీర్వచనాలు, శ్రీవారి శేషవస్త్రాలతో పాటు తీర్థప్రసాదాలను అందించారు. తెలంగాణ అభివృద్ధికి సిఎం కెసిఆర్ ఎంతగానో కృషి చేశారని ఆయన కొనియాడారు. వచ్చే ఎన్నికల్లో టిఆర్‌ఎస్ మళ్లీ విజయం సాధించి తిరిగి అధికారంలోకి […]

తిరుమల : తెలంగాణ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి తన కుటుంబంతో కలిసి ఆదివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. శ్రీవారి దర్శనం అనంతరం కడియం కుటుంబానికి రంగనాయకుల మండపంలో ఆలయ పండితులు ఆశీర్వచనాలు, శ్రీవారి శేషవస్త్రాలతో పాటు తీర్థప్రసాదాలను అందించారు. తెలంగాణ అభివృద్ధికి సిఎం కెసిఆర్ ఎంతగానో కృషి చేశారని ఆయన కొనియాడారు. వచ్చే ఎన్నికల్లో టిఆర్‌ఎస్ మళ్లీ విజయం సాధించి తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని ఆయన పేర్కొన్నారు. సిఎం కెసిఆర్ మళ్లీ సిఎం కావాలని తాను శ్రీవారిని ప్రార్థించినట్టు కడియం స్పష్టం చేశారు.

DCM Kadiyam Srihari  visited the Tirumala Temple

Comments

comments

Related Stories: