శ్రీదేవికి అరుదైన గౌరవం

Swiss government to honour Sridevi with statue

అతిలోక సుందరి శ్రీదేవి మరణాన్ని అభిమానులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఆమెకు కోట్లాదిమంది అభిమానులున్నారు. తాజాగా స్విట్జర్లాండ్ ప్రభుత్వం శ్రీదేవికి అరుదైన గౌరవాన్ని కట్టబెట్టేందుకు సిద్ధమైంది. పర్యాటక దేశమైన స్విట్జర్లాండ్‌లో సినిమా షూటింగ్‌లు ఎక్కువగానే జరుగుతుంటాయి. ఆ దేశం నేపథ్యంలో ఎక్కువగా బాలీవుడ్ చిత్రాలను తెరకెక్కించిన యశ్‌చోప్రాపై ఆ దేశ ప్రభుత్వం అరుదైన గౌరవాన్ని కనబర్చింది. 2016వ సంవత్సరంలో ఆయన విగ్రహాన్ని ఆ దేశంలో ఏర్పాటు చేయడం జరిగింది. తాజాగా శ్రీదేవి విగ్రహాన్ని కూడా ఏర్పాటుచేసేందుకు స్విట్జర్లాండ్ ప్రభుత్వం సన్నాహాలు మొదలుపెట్టింది. శ్రీదేవి పలు చిత్రాల షూటింగ్‌ల కోసం తమ దేశం వచ్చారని… ఆమె తమ దేశానికి టూరిస్టులు పెరగడంలో దోహదపడ్డారని అక్కడి ప్రభుత్వం భావించింది. అందుకే శ్రీదేవి విగ్రహాన్ని ఏర్పాటుచేయాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది.

Comments

comments