శోభితకు బిగ్ ఆఫర్

 Big Offer To Actress Sobhita Dhulipala
‘గూఢచారి’ చిత్రంతో శోభిత ధూళిపాల పేరు మార్మోగిపోయింది. ఈ తెనాలి అమ్మాయి తడాఖా చూసి కుర్రకారు మైమరచిపోయారు. గూఢచర్యం నేపథ్యంలోని ఈ సినిమాలో ఈ తెలుగమ్మాయి రొమాంటిక్‌గా నటించి ఆకట్టుకుంది. క్రిటిక్స్ నుంచి అద్భుతమైన ప్రశంసలు ఆమెకు దక్కాయి. ఇక ప్రతిభ ఉన్నచోటికి అవకాశాలు వెతుక్కుంటూ వెళ్తాయి. ఇప్పుడు ఆన్‌లైన్ స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ శోభితకు ఓ భారీ ఆఫర్ ఇచ్చింది. ఈ బిగ్ డీల్ ఆమెకు పెద్ద రేంజులో కలిసొస్తుందని విశ్లేషిస్తున్నారు. ఆన్‌లైన్‌లో టాప్ రేటింగ్‌తో దూసుకుపోతున్న ‘సాక్రిడ్ గేమ్స్’ వెబ్ సిరీస్ సీజన్ 2కు శోభితను ఎంపిక చేసుకున్నారు. దీనికి టాప్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్‌ను ఏరికోరి ఎంచుకున్నారు. శోభిత ఇదివరకు అనురాగ్‌తో ‘రామన్ రాఘవ్ 2.0’ కోసం పనిచేసింది. ఆ క్రమంలోనే ఈ ఆఫర్ వచ్చిందట.

Comments

comments