శునక ‘రాజ’భోగం

నీది కుక్క బుద్ధి …పెట్టింది తిని కుక్కలా ఓ మూల పడివుండు…కుక్క తోక వంకర ..కుక్క కన్నా హీనమైన బతుకు…కనీసం కుక్కకున్న విశ్వాసం లేదు. ఇలాంటి ఉపమానాలకు ఇక స్వస్తి పలకండి. ఎందుకంటే మీ మాటలు ఈ కుక్కలు విన్నాయంటే మీపై ఎగబడతాయి. ఆపై మిమ్మల్ని అసహ్యించుకుంటాయి. ఖరీదైన భవనాల్లో , పసైందన విందులతో విలాసవంతమైన జీవితాలు గడుపుతున్న శునకాలున్నాయి. ప్రత్యేక ఏసీ గదులే ఆ శునకాలకు ఆవాసం, బిర్యానినీ తలదన్నే ఖరీదైన ఆహారాన్ని ఆరగిస్తున్నాయి, ఏమాత్రం […]

నీది కుక్క బుద్ధి …పెట్టింది తిని కుక్కలా ఓ మూల పడివుండు…కుక్క తోక వంకర ..కుక్క కన్నా హీనమైన బతుకు…కనీసం కుక్కకున్న విశ్వాసం లేదు. ఇలాంటి ఉపమానాలకు ఇక స్వస్తి పలకండి. ఎందుకంటే మీ మాటలు ఈ కుక్కలు విన్నాయంటే మీపై ఎగబడతాయి. ఆపై మిమ్మల్ని అసహ్యించుకుంటాయి. ఖరీదైన భవనాల్లో , పసైందన విందులతో విలాసవంతమైన జీవితాలు గడుపుతున్న శునకాలున్నాయి. ప్రత్యేక ఏసీ గదులే ఆ శునకాలకు ఆవాసం, బిర్యానినీ తలదన్నే ఖరీదైన ఆహారాన్ని ఆరగిస్తున్నాయి, ఏమాత్రం హుషారు తగ్గిన వెంటనే వైద్య పరీక్షలు. ఇంట్లో బోర్ కొడితే బయట షికారులు. ఎవరూ ఉహించని జీవితాలను గడుపుతున్న శునక ‘రాజ’ జీవితాలను ఒకసారి పరిశీలిద్డాం.

ముఖ్యమంత్రి మనువనికి ముచ్చటే..

సీఎం కేసీఆర్ ముద్దుల మనువడు సైతం శునక ప్రియుడే. విభిన్న జాతుల కుక్కల పెంపకంలో మెలుకువలు తెలుసుకోవడం కోసం తరచూ కుక్కలను విక్రయించే కేంద్రాలకు వెళుతుంటాడు. వారానికి ఒకసారి కుక్కల విక్రయ కేంద్రాలు తిరుగాడుతూ తన ముచ్చట తీర్చుకుంటున్నాడు. ఈ క్రమంలో ల్యాబ్ జాతికి చెందిన రెండు కుక్కలను సైతం పెంచుకుంటున్నట్లు  సమాచారం.

కుక్కలంటే విశ్వాసానికి మారుపేరు. కుక్కకు ఉన్న విశ్వాసం ఏ జంతువుకు ఉండదంటారు. తనను పోషించే వారి క్షేమం కోసం ఎంతకైనా తెగిస్తాయి. యజయాని ఇంటికి రాగానే అతని బాగోగులను కళ్లతోనే పరీక్షిస్తాయి. అతని చుట్టూ తిరుగుతూ ఆనందం వ్యక్తం చేస్తాయి. అనుకోకుండా యజమాని మరణిస్తే ఆ బెంగతో అనతికాలంలో అసు వులు బాసిన శునకాలున్నాయన్నది అక్షరసత్యం. కుక్కల జాతుల్లో వందలాది రకాలు న్నాయి. ఒక్కో జాతికి ఓ లక్షణం ఉంటుంది. ఈ క్రమంలో ల్యాబ్ , రాట్ విల్లర్ జాతికి చెందిన కుక్కలు స్నేహ భావంతో మెదు లుతాయి. ఈ జాతి కుక్కలకు మిగితా వాటితో పోలిస్తే తెలివి ఎక్కువగా ఉంటుందట. హైదరాబాద్‌లో ఎక్కువగా ల్యాబ్, జర్మన్ షప్పడ్, పగ్, బుల్‌డాగ్స్ విక్రయాలు అధికంగా జరుగుతున్నాయి. అయితే వీటి ధర రూ.40 వేల నుంచి లక్ష రూపాయల వరకు ఉంటుంది.కాగా కొరియన్ మస్టిఫ్

నే శునకం రూ. లక్షల్లో పలుకుతుంది. జంటనగరాల్లో రమారమి 3౦౦కి పైగా కు క్కలు విక్రయించే కేంద్రాలున్నాయి.  మానసిక ఒత్తిడి నుంచి విముక్తిః కేవలం తమ మానసిక వత్తిడి నుంచి బయటపడేందుకే కుక్కలను పెంచుతున్నట్లు ఓ సర్వేలో తేలింది. బాహ్య ప్రపంచంలో వ్యాపారాలు, ఉద్యోగాలు, షూటింగ్‌లలో బిజీగా గడిపి ఇంటికి వచ్చిన వారు తమ పెంపుడు జంతువులను చూసుకుని ఒత్తిడి నుంచి బయపడుతున్నారు.
డాగ్ షో కుక్కలకు సంబంధించిన ఆహార పదార్థాలు తయారు చేసే కంపెనీలు హైదరబాద్, వర ంగల్‌లలో ఏటా డాగ్ షోలు ఏర్పాటు చే స్తా రు. ప్రముఖ కంపెనీలు రాయల్ కెనల్, పె డి గ్రీ,డూల్స్‌సంస్థలు డాగ్‌షో నిర్వహిస్తున్నా యి.

గ్రామ సింహాలకు గ్రాండ్ హోటల్ హైద రాబాద్ నగరంలో వినూత్న రీతిలో కుక్కల కోసం గ్రాండ్‌గా హోటల్ పెద్ద ఎత్తున ప్రారంభించే సన్నాహాలు చేస్తున్నారు. స్టార్ హోటల్ తరహాలో ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే ఓ బడా వ్యాపారి స్థల సేకరణ పనిలో నిమగ్నమయ్యాడు. దాదాపు 2 ఎకరాల్లో కుక్కలకు, పిల్లులకు ఆహారాన్ని అందించే యోచన చేస్తున్నారు. మాదాపూర్‌లో హ్యాపీ డాగ్ కెనల్, మలక్‌పేట్ పరిసర ప్రాంతంలో సాయికృష్ణపెట్స్ పేరిట కుక్కలకోసం హాస్టల్స్ ఉన్న విషయం విదితమే.  జూనియర్ ఎన్టీఆర్ వద్ద రూ.20లక్షల విలువ చేసే కుక్కలున్నాయి. ప్రభాస్, మహేష్‌బాబు, నాగార్జున, రానా, ప్రముఖ క్రీడాకారిణి సైనా నేహ్వాల్ తదితరులు శునక ప్రియుల జాబితాలో ఉన్నారు. దర్శకులు పూరీ జగన్నాధ్ ఇంట్లోనూ పదుల సంఖ్యలో శునకాలున్నాయి.

Comments

comments