శునకాలతో తిప్పలు…

రాంచీ: దాణా కుంభకోణం కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ అనారోగ్యానికి గురి అవడంతో రాంచీలోని రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తనను ఉంచిన వార్డులో దుర్వాసన వస్తోందని, బయట నుంచి కుక్కలు అరుస్తుంటే లోపలికి వినపడుతోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో నిద్రపట్టక ఎన్నో తిప్పలు పడుతున్నానని ఆయన ఆసుపత్రి వర్గాలకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై ఈ రోజు రిమ్స్‌ సూపరింటెండెంట్‌ వివేక్‌ కశ్యప్‌ మీడియాతో […]

రాంచీ: దాణా కుంభకోణం కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ అనారోగ్యానికి గురి అవడంతో రాంచీలోని రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తనను ఉంచిన వార్డులో దుర్వాసన వస్తోందని, బయట నుంచి కుక్కలు అరుస్తుంటే లోపలికి వినపడుతోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో నిద్రపట్టక ఎన్నో తిప్పలు పడుతున్నానని ఆయన ఆసుపత్రి వర్గాలకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై ఈ రోజు రిమ్స్‌ సూపరింటెండెంట్‌ వివేక్‌ కశ్యప్‌ మీడియాతో మాట్లాడుతూ… లాలూ ప్రసాద్‌ యాదవ్‌ని కొత్త వార్డుకి తరలించేందుకు బిర్సా ముందా కేంద్ర కారాగార సూపరింటెండెంట్ అనుమతి ఇచ్చారని తెలిపారు. దీంతో ఆయనను ఆసుపత్రి వేరే వార్డులోని గది నెంబరు 11కు తరలించామని తెలిపారు.

Related Stories: