శుద్ధ జలంతో వ్యాధులు దూరం

ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి మన తెలంగాణ/నర్వ:  గ్రామాలోని ప్రజలు బోరు బావుల వద్ద వచ్చే నీటిని వినియోగించుకుండా శుద్ధజలాన్ని అలవాటు చేసుకోవాలని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి సూచించారు. శనివారం మండల పరిధిలోని కుమార్ లింగంపల్లి గ్రామంలో ఎంపి నిధులు రూ.2 లక్షల 50 వేల వ్యయంతో ఏర్పాటు చేసిన శుద్ధ జలం కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ప్రజలు శుద్ధ జలం వాడడం ద్వారానే వ్యాధులను నివారించవచ్చన్నారు. వర్షాకాలం ప్రారంభం కావడంతో నీరు కలుషితం అయ్యే అవకాశం ఉంటుందని, […]

ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి

మన తెలంగాణ/నర్వ:  గ్రామాలోని ప్రజలు బోరు బావుల వద్ద వచ్చే నీటిని వినియోగించుకుండా శుద్ధజలాన్ని అలవాటు చేసుకోవాలని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి సూచించారు. శనివారం మండల పరిధిలోని కుమార్ లింగంపల్లి గ్రామంలో ఎంపి నిధులు రూ.2 లక్షల 50 వేల వ్యయంతో ఏర్పాటు చేసిన శుద్ధ జలం కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ప్రజలు శుద్ధ జలం వాడడం ద్వారానే వ్యాధులను నివారించవచ్చన్నారు. వర్షాకాలం ప్రారంభం కావడంతో నీరు కలుషితం అయ్యే అవకాశం ఉంటుందని, అందుకు శుద్ధ జలాన్ని తాగాలన్నారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, మరుగుదొడ్లను నిర్మించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో  టిఆర్‌ఎస్ మండలాధ్యక్షులు మహేశ్వర్‌రెడ్డి, గ్రామ సర్పంచ్ చెన్నమ్మ, బీజేపీ మండలాధ్యక్షులు సత్యం, పంచాయతీ కార్యదర్శి రాజబాబు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Comments

comments

Related Stories: