శితిలావస్థలో దహెగాం విద్యుత్ ఉపకేంద్రం కార్యలయం

దహెగాం: మండల కేంద్రంలోని విద్యుత్ ఉపకేంద్రంపై విద్యుత్ ఉన్నత అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. విద్యుత్ ఉపకేంద్రంలో విధులు నిర్వహించే సిబ్బంది ఇబ్బందులకు గురవుతున్నారు. 25 సంవత్సరాల క్రితం నిర్మించిన విద్యుత్ ఉపకేంద్రం కార్యలయం పూర్తిగా శిథిలావస్ధకు చేరుకుంది. కార్యలయం నిర్మించినప్పటి నుండి ఇప్పటి వరకు కార్యలయంకు ఎలాంటి మరమ్మత్తులు చేయలేదు. కార్యలయం లోపల, బయట చాలా చోట్ల పగుల్లు తెలి పేచ్చులుడుతున్నాయి. వర్షకాలం పగుల్ల నుండి వాన నీరు కారుతుంది. సిమెంట్ పేచ్చులు ఉడి […]

దహెగాం: మండల కేంద్రంలోని విద్యుత్ ఉపకేంద్రంపై విద్యుత్ ఉన్నత అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. విద్యుత్ ఉపకేంద్రంలో విధులు నిర్వహించే సిబ్బంది ఇబ్బందులకు గురవుతున్నారు. 25 సంవత్సరాల క్రితం నిర్మించిన విద్యుత్ ఉపకేంద్రం కార్యలయం పూర్తిగా శిథిలావస్ధకు చేరుకుంది. కార్యలయం నిర్మించినప్పటి నుండి ఇప్పటి వరకు కార్యలయంకు ఎలాంటి మరమ్మత్తులు చేయలేదు. కార్యలయం లోపల, బయట చాలా చోట్ల పగుల్లు తెలి పేచ్చులుడుతున్నాయి. వర్షకాలం పగుల్ల నుండి వాన నీరు కారుతుంది. సిమెంట్ పేచ్చులు ఉడి కింద పడుతుండటంతో సిబ్బంది భయం భయంగా విధులు నిర్వహిస్తున్నారు. వర్షాలు ఎక్కువ కురిసినపుడు ఏం జరుగుతుందో అని భయపడుతున్నారు.

సిబ్బందికి కనిస సౌకర్యాలు లేవు
విద్యుత్ ఉపకేంద్రంలో విధుల నిర్వహించే సిబ్బందికి కనిస సౌకర్యాలైన త్రాగు నీరు, మరుగుదోడ్లు ,స్నానపు గదులు తదితర ఏ ఒక్క సౌకర్యం కూడ లేదు . విద్యుత్ ఉప కేంద్రంలోని బోర్ చేడి పోయి సంవత్సరాలు గుడుస్తున్నాయి. బోర్ సౌకర్యం లేక కార్యలయం సిబ్బంది, కార్యలయంకు వచ్చే వినియోగదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎలాంటి అవసరం ఉన్న అన్నింటికి బయటకు వెల్లల్సిన పరిస్థితి . కార్యలయం సిబ్బంది తహసీల్దార్ కార్యలయం అవరణలోని చేతి పంపు వద్ద మంచినీరు తెచ్చుకోని వారి అవసరాలకు వాడుకుంటున్నారు. కార్యలయంలో బోర్ సౌకర్యం లేక హరిత హరం కార్యక్రమంలో నాటిన మొక్కలు ఎండ కాలం ఎండిపోతున్నాయి.

అవరణలో పిచ్చి మొక్కలు ,బండలు . వాటి మద్య విష కిటాకాలు
విద్యుత్ ఉపకేంద్రం అవరణం పిచ్చి మొక్కలతో నిండి పోయింది. సబ్ స్టేషన్ యార్డు పనుల కోసం కాంట్రక్టర్ బండలు తెప్పించి కార్యలయం అవరణలో ఉంచారు. కాంట్రక్టర్ సకాలంలో పనులు చేయకుండ నిర్లక్ష్యం చేస్తుండటంతో బండలల్లో విష కిటాకాలు చేరి వాటిలో ఉంటున్నాయి. పిచ్చి మొక్కల మద్యలో పాములు అవాసం ఏర్పాటు చేసుకోని కార్యలయం అవరణలో తిరుగుతున్నాయి. ప్రస్తుతం వాన కాలంలో విష పురుగులతో పాటు పాముల బెడద మరింత పేరిగిపోయింది.అధికారులు ఉప కేంద్రంలో పని చేసే సిబ్బంది సమస్యలను పట్టించుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. అవరణంలోని పిచ్చి మొక్కలు తోలగించడంలో యాజమాన్యం చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు ఉన్నాయి. కార్యాలయంలో పచి చేసే సిబ్బందికి కనిస సౌకర్యాలు కల్పించాలని అవరణలో పిచ్చి మొక్కలు తోలగించాలని సిబ్బంది కోరుతున్నారు. ఈ విషయంపై ఎఈ రవీందర్‌ని సంప్రదించగా కార్యలయం భవనం మరియు సిబ్బందికి ఉన్న సమస్యలపై సివిల్ విభాగం వారికి తెలియజేసినట్టు తెలిపారు. త్వరలోనే అన్ని సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Comments

comments

Related Stories: