మన తెలంగాణ/ వెల్గటూర్ : మండలం లోని ముత్తునూర్ లో నూతనం గా నిర్మిస్తున్న 33/ 11 కెవి సబ్ స్టేషన్ పనులు శరవేగంగా కోసాగుతున్నాయి . రూ.కోటి ముప్పది లక్షల వ్యయం తో నిర్మిస్తున్న 33/11 కెవి సబ్ స్టేషన్ పనులు వేగంగా జరుగుచున్నాయి. మొదట సబ్ స్టేషన్ నిర్మాణం కోసం స్థల నిర్ణయం కొంత జాప్యం అయినప్పటికి ని ప్రభుత్వ చీఫ్విప్శ్వర్,ఎంపిపి పోనుగొటి శ్రీనివాసరావు స్థానిక నాయకుల , అధికారుల చోరవ తో స్థల సేకరణ తో ప్రారంభమై శర వేగంగా పనులు కోనసాగుతున్నాయి. ఈ సబ్ స్టేషన్ నిర్మాణం తో మండలం లోని ముత్తునూర్ తో పాటు రాంనూర్ , ముక్కట్రావుపేట, చెగ్యాం గ్రామాల లో లోహోల్టేజీ సమస్యలు పూర్తిగా తీరనున్నాయని రైతులు భావిస్తున్నారు. మండలం లో ప్రస్తుతం వెల్గటూర్,పైడిపల్లి, కొత్తపేట, పాతగుడూర్ ,ముంజంపల్లి,గుల్లకోట గ్రామాల్లో33/11 సబ్సేషన్లు నిర్మాణం లు జరిగి పూర్తిస్థాయిలో సేవలు కోనసాగిస్తున్నాయి . ఎండపల్లి గ్రామం లో మరో సబ్స్టేషన్ నిర్మాణం పనులు ప్రారంభం అయినాయి, దీంతో మండలం లో లోహోల్టేజీ సమస్యలు తీరుతాయని మండల రైతులు ఆశభావం వ్యక్తం చేస్తున్నారు.
Comments
comments