శరవేగంగా మిషన్ భగీరథ

ఇప్పటికే 737 గ్రామాలకు శుద్ధి జలాల పంపిణీ త్వరలో జిల్లా వ్యాప్తంగా శుద్ధి జలాలు అక్టోబర్ నాటికి మహబూబ్‌నగర్‌కు రక్షిత మంచినీరు తప్పనున్న నీటి కష్టాలు మిషన్‌భగీరథపై ప్రజల్లో హర్షం మన తెలంగాణ/మహబూబ్‌నగర్ : జిల్లాలో ప్రజలందరికి సురక్షితమై శుద్ధి జలం అందించాలన్న లక్షంతో ప్రభుత్వం చేపడుతున్న మిషన్ భగీరథ పనులు వేగంగా జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఎన్నికల హామీల్లో భాగంగా  ఇచ్చిన హామీని నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్నారు. గతంలో ప్రజలకు సురక్షితమైన మంచినీరు […]

ఇప్పటికే 737 గ్రామాలకు శుద్ధి జలాల పంపిణీ
త్వరలో జిల్లా వ్యాప్తంగా శుద్ధి జలాలు
అక్టోబర్ నాటికి మహబూబ్‌నగర్‌కు రక్షిత మంచినీరు
తప్పనున్న నీటి కష్టాలు
మిషన్‌భగీరథపై ప్రజల్లో హర్షం

మన తెలంగాణ/మహబూబ్‌నగర్ : జిల్లాలో ప్రజలందరికి సురక్షితమై శుద్ధి జలం అందించాలన్న లక్షంతో ప్రభుత్వం చేపడుతున్న మిషన్ భగీరథ పనులు వేగంగా జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఎన్నికల హామీల్లో భాగంగా  ఇచ్చిన హామీని నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్నారు. గతంలో ప్రజలకు సురక్షితమైన మంచినీరు లభించక అనేక అవస్థలు ఎదుర్కొనేవారు. కిలోమీటర్ల కొద్ది వెళ్లి నీళ్లు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉండేది. ఎండాకాలం వచ్చిందంటే నీటి కష్టాలు వర్ణించలేనివి.ముఖ్యంగా మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో సైతం 15 రోజుల కోసారి మున్సిపల్ నీరు లభించేవి. అదికూడా 60 కీమీ దూరంలో ఉన్న రామన్‌పాడ్ ప్రాజెక్టు ద్వారా మహబూబ్‌నగర్‌కు పైపుల ద్వారా మంచినీటి తరలించే పరిస్థితి ఉండేది. మద్యలో పైపులు లీకేజీ జరిగితే మరో వారం రోజులు తాగునీటికి గండమే ఏర్పడేది. మక్తల్, నారాయణపేట తదితర ప్రాంతాల సైతం నీటి కోసం అనేక అవస్థలు ప్రజలు ఎదుర్కొనేవారు. ఏరంచునే ఊర్లు ఉన్నప్పటికీ తాగునీరు లేని పల్లెలు ఎన్నో . కృష్ణానది జిల్లా మధ్యలో వెళ్తున్నా పాలమూరు జిల్లా తాగునీటికి కటకటలు ఏర్పడేవి. కొన్ని ప్రాంతాల్లో ఫ్లోరైడ్ నీరే ప్రజలకు తాగునీరుగా చేసుకునేవారు.

Related Stories: