శరవేగంగా నాలుగు వరుసల మణిహారం

రెండు ప్యాకేజీలలో రహదారి పనులు ముగిసిన రెండవ ప్యాకేజీ టెండర్ల ప్రక్రియ వచ్చే నెల 26న మొదటి విడత టెండర్లు ఖరారు మంచిర్యాల, కొమురంభీం జిల్లాల మీదుగా చంద్రపూర్ వరకు నిర్మాణం రెండేళ్లలో పనుల పూర్తికి సన్నాహాలు మనతెలంగాణ/మంచిర్యాల : మంచిర్యాల నుండి మహారాష్ట్రలోని చంద్రపూర్ వరకు నాలుగు వరసల రహదారి పనులు ఊపందుకోనున్నాయి. ప్రతినిత్యం ఈ రోడ్డు పై ప్రమా దాలు జరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా స్పందిం చింది. మంచిర్యాల, కొమురంభీం జిల్లాల […]

రెండు ప్యాకేజీలలో రహదారి పనులు
ముగిసిన రెండవ ప్యాకేజీ టెండర్ల ప్రక్రియ
వచ్చే నెల 26న మొదటి విడత టెండర్లు ఖరారు
మంచిర్యాల, కొమురంభీం జిల్లాల మీదుగా చంద్రపూర్ వరకు నిర్మాణం
రెండేళ్లలో పనుల పూర్తికి సన్నాహాలు

మనతెలంగాణ/మంచిర్యాల : మంచిర్యాల నుండి మహారాష్ట్రలోని చంద్రపూర్ వరకు నాలుగు వరసల రహదారి పనులు ఊపందుకోనున్నాయి. ప్రతినిత్యం ఈ రోడ్డు పై ప్రమా దాలు జరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా స్పందిం చింది. మంచిర్యాల, కొమురంభీం జిల్లాల మీదుగా సాగనున్న రహదారి పనులను రెండు ప్యాకేజీలలో చేపట్టనుండగా రెండవ విడత ప్యాకేజీ పను లకు టెండర్ల ప్రక్రియ పూర్తయి పనులు జరుగుతుండగా మొదటి విడత ప్యాకేజీ పనులకు వచ్చే నెల 26న టెండర్లను ఖరారు చేశారు. రూ. 15 వందల కోట్లతో 94 కిలోమీటర్ల పొడవున నాలుగు వరుసల రహదారి పనులు జరుగుతుండగా దీనిని జాతీయ రహదారిగా గుర్తించాలని కేంద్రమంత్రి గడ్కరీకి టిఆర్‌ఎస్ నేతలు విన్నవించారు. ఈ మేరకు కేంద్ర మంత్రి కూడా సానుకూలంగా స్పందించారు. దీంతో రహదారి పనులు మరింత శరవేగంగా జరగనున్నాయి. మొదటి విడతలో కాగజ్‌నగర్ మీదుగా మహారాష్ట్ర సరిహద్దు వరకు 52 కిలోమీటర్ల పొడవున రోడ్డు నిర్మాణానికి రూ.810 కోట్లు కేటాయించారు. టెండర్ల ప్రక్రియ జరగనున్న నేపథ్యంలో పనులు కూడా చేపట్టే ందుకు అధికారులు కసరత్తులు చేస్తున్నారు. భారత్ మాల పరియోజన పథకం కింద రోడ్డు పనులకు బడ్జెట్‌లో నిధులు కూడా కేటాయించారు.

రాష్ట్రంలో చేపడుతున్న జాతీయ రహదారుల విస్తరణలు మొదటి విడతలోనే మంచిర్యాలచంద్రపూర్ రహదారి పనులు చేయాలని కేంద్ర ప్రభుత్వం కూడా నిర్ణయించి, ఇందు కు అవసరమైన నిధులను కేటాయించింది. రహదారి నిర్మాణంలో భాగంగా బెల్లంపల్లి, క్యాతన్‌పల్లి, శ్రీరాం పూర్, కొమురంభీం జిల్లాలోని ఆసిఫాబాద్ బైపాస్ రోడ్ల నిర్మాణాలు చేపట్టేందుకు నిర్ణయించగా మంద మర్రి వద్ద రోడ్డు నిర్మాణంలో భాగంగా పక్క భవనాలు సైతం కూలిపోయే ప్రమాదం ఉన్నందు వల్ల మంద మర్రిలో కూడా బైపాస్ రోడ్డు నిర్మాణం చేపట్టాలని తెలంగాణ ప్రజాప్రతినిధులు కేంద్రమంత్రిని కోరగా సానుకూలంగా స్పందించారు.గ్రామాలు ఉన్న ప్రాంతంలో 150 అడుగులు, నివాస గృహాలు లేని ఇతర ప్రాంతాల్లో గరిష్టంగా 198 అడుగుల వెడల్పులో రహదారి నిర్మాణం చేపట్టేందుకు ఆయా మండలాల రెవెన్యూ అధికారులు భూ సేకరణ పనులు ప్రారం భించి ఇండ్లకు మార్కింగ్ ఇచ్చారు. నాలుగు వరసల రహదారి నిర్మాణంలో భాగంగా అవసరం ఉన్న ఎగువ వంతెనలు కావాల్సిన భూములపై పూర్తి నివేదికలు తయారు చేసి, అధికారులు ప్రభుత్వానికి అందజేశారు.

మంచిర్యాల నుంచి కొమురంభీం జిల్లాలోని వాం కిడి మండలం గోయగాం వరకు నివేదిక ప్రకారం సిబ్బంది కొలతలు చేపట్టి మార్కింగ్ ఇచ్చారు. మంచిర్యాల జిల్లాలో ఇందారం క్రాస్‌రోడ్డు తరువాత శ్రీరాంపూర్ సింగరేణి జిఎం కార్యాలయం నుంచి తాండూర్ మండలం వరకు సుమారు 45 కిలోమీటర్ల పొడవున ఎగువ వంతెనలు బైపాస్ రోడ్లతో రహదారి నిర్మాణానికి డిజైన్‌లు పూర్తి చేశారు. రహదారి మంచిర్యాల జిల్లా కేంద్రంలోకి వెళ్లకుండా క్యాతన్‌పల్లి పంచాయతీ పరిధిలో బైపాస్ రోడ్డు , బెల్లంపల్లి వద్ద మరో బైపాస్ రోడ్డును నిర్మించనున్నారు. మందమర్రి పట్టణ శివారులోని కళ్యాణఖని ఓపెన్‌కాస్టు వద్ద రహదారిపై టోల్‌ప్లాజా,కొమురంభీం జిల్లాలోని జిల్లా కేంద్రమైన ఆసిఫాబాద్‌లో బైపాస్ రోడ్డు నిర్మాంచాలని ప్రతిపాదించారు. ఇప్పటికే రహదారి నిర్మాణానికి అవసరమయ్యే భూముల కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసి, స్థలాలను సేకరిస్తున్నారు. ఏది ఏమైనా నాలుగు వరుసల రహదారి నిర్మాణ పనులు శరవేగంగా జరగనున్నాయి.

Related Stories: