శంషాబాద్ లో ఢిల్లీ విమానం ఎక్కిన రాహుల్

హైదరాబాద్: తెలంగాణలో రెండు రోజుల పర్యటన నిమిత్తం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సోమవారం హైదరాబాద్ కు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే రాహుల్ పర్యటన నేటితో ముగిసింది.  మొదటి రోజు మహిళా సంఘాలతో, శేరిలింగంపల్లి బహిరంగసభలో ఆయన మాట్లాడారు. మంగళవారం ఉదయం పత్రికా సంపాదకులతో సమావేశం అయ్యారు. అనంతరం పారిశ్రామికవేత్తలతో మీటింగ్, గన్ పార్క్ వద్ద తెలంగాణ అమరవీరులకు రాహుల్ నివాళులర్పించారు. తర్వాత అక్కడి నుంచి  బస్ లో బయల్దేరి సరూర్ నగర్ చేరుకున్నారు. అక్కడ కాంగ్రెస్ పార్టీ […]

హైదరాబాద్: తెలంగాణలో రెండు రోజుల పర్యటన నిమిత్తం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సోమవారం హైదరాబాద్ కు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే రాహుల్ పర్యటన నేటితో ముగిసింది.  మొదటి రోజు మహిళా సంఘాలతో, శేరిలింగంపల్లి బహిరంగసభలో ఆయన మాట్లాడారు. మంగళవారం ఉదయం పత్రికా సంపాదకులతో సమావేశం అయ్యారు. అనంతరం పారిశ్రామికవేత్తలతో మీటింగ్, గన్ పార్క్ వద్ద తెలంగాణ అమరవీరులకు రాహుల్ నివాళులర్పించారు. తర్వాత అక్కడి నుంచి  బస్ లో బయల్దేరి సరూర్ నగర్ చేరుకున్నారు. అక్కడ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన బహిరంగసభలో రాహుల్ ప్రసంగించారు. ఈ కార్యక్రమం అనంతరం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి ఢిల్లీ విమానం ఎక్కిన రాహుల్ గాంధీకి కాంగ్రెస్ పార్టీ నేతలు, నాయకులు వీడ్కోలు పలికారు.

Related Stories: