వ్యవసాయ భూములకు వెళ్లేందుకు రహదారి సౌకర్యం కల్పించాలి

Providing highway facility for agricultural lands

జగిత్యాల ఎంఎల్‌ఏ జీవన్‌రెడ్డి

మనతెలంగాణ/జగిత్యాల: జగిత్యాల మండలం తి ప్పన్నపేట రెవెన్యూ గ్రామ పరిధిలోని వ్యవసాయ భూములకు వెళ్లేందుకు రహదారి సౌకర్యం కల్పించాలని కోరుతూ జగిత్యాల ఎంఎల్‌ఏ జీవన్‌రెడ్డి సో మవారం ప్రజావాణిలో జిల్లా జాయింట్ కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జీవన్‌రెడ్డి మాట్లాడుతూ, తిప్పన్నపేట రెవెన్యూ గ్రామ పరిధిలో ఎస్‌కెఎన్‌ఆర్ ప్రభు త్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు సందర్భంగాసేకరించిన భూముల నుంచి వ్యవసాయ భూములకు వెళ్లే రహదారి కళాశాల మైదానం మధ్య నుంచి ఉండేదన్నా రు. అయితే మధ్యలో ఉన్న రహదారికి ప్రత్యామ్నాయంగా ఉత్తరం వైపు కళాశాల సరిహద్దు నుంచి రహదారి ఏర్పాటు చేయడంతో గత 50సంవత్సరా ల నుంచి ఆ రహదారి గుండానే రైతులు వెళ్తున్నారన్నారు. అయితే 2012-13లో రోడ్డు శాశ్వత ప్ర తిపాదికన నిర్మాణం కోసం ప్రతిపాదించగా రెవె న్యూ అధికారులు,కళాశాల యాజమాన్యం సమన్వయంతో స్థల పరిశీలన చేయడం జరిగిందన్నారు. పూర్వ కరీంనగర్ జిల్లా జాయింట్ కలెక్టర్ కళాశా ల ఉత్తరం వైపు సరిహద్దులో సబ్‌స్టేషన్ పక్క నుంచి 24ఫీట్ల వెడల్పుతో శాశ్వత ప్రాతిపదికన రోడ్డు ని ర్మాణం కోసం డైరెక్టర్ ఆఫ్ కాలేజియేట్ ఆఫ్ ఎడ్యూకేషన్ అనుమతి కోసం ప్రతిపాదనలుపంపించడం జరిగిందని జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. అయితే కళాశా ల యాజమాన్యం జాయింట్ కలెక్టర్ ప్రతిపాదలనకు అనుగుణంగా మంజూరు కల్పించకపోవడం తో పాటు ఇంత వరకు వినియోగించుకుంటున్న ర హదారిని ఆటంకపరచడం వల్ల భూముల్లోకి వెళ్లేందుకు దారి లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ నేపథ్యంలో రెవెన్యూ రికార్డులకు అనుగుణంగా ఉన్న రహదారిని అనుమతించడమో, ప్రత్యామ్నాయ రహదారి ఏర్పాటుకు అనుమతి ఇ వ్వడమో చేసిరైతుల ఇబ్బందులను తొలగించాలని జాయింట్ కలెక్టర్ రాజేశంను జీవన్‌రెడ్డి కోరారు.

Comments

comments