వ్యభిచార గృహంపై పోలీసుల దాడి..!

Hyderabad: Task Force Police Attack on the Prostitution Home

హైదరాబాద్‌: నగరంలోని కార్ఖానా పోలీస్ స్టేషన్‌ పరిధిలో గల పాత వాసవీనగర్‌లోని ఓ ప్లాట్‌లో గుట్టుచప్పుడు కాకుండా కొనసాగుతున్న వ్యభిచార గృహంపై టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో ఇద్దరు నిర్వాహకులతో పాటు ఇద్దరు విటులు, ఓ యువతిని అదుపులోకి తీసుకున్నారు. ఒడిషాకు చెందిన ఓ యువతిని రప్పించి వ్యభిచారం నిర్వహిస్తున్న సమయంలో దాడి చేసి ఆమెను రక్షించారు.  వారి వద్ద నుంచి రూ. 13వేల నగదుతో పాటు ఆరు మొబైల్‌ లను స్వాధీనం చేసుకున్నారు.

Comments

comments