వ్యభిచారం కేసులో డాక్టర్ కోసం గాలింపు

యాదాద్రి: మైనర్‌ల కిడ్నాప్, వ్యభిచారం కేసులో బాలికలకు ఇంజక్షన్లు ఇచ్చిన డాక్టర్ స్వామి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ప్రాథమిక విచారణలో డాక్టర్ స్వామి పేరును నిందితులు వెల్లడించారు. దీంతో డాక్టర్ పట్టుబడితే కీలక సమాచారం అందుతుందని పోలీసులు భావిస్తున్నారు. డాక్టర్ స్వామి పట్టుబడితే ఇప్పటి వరకు ఎంతమంది బాలికలకు ఇంజక్షన్లు ఇచ్చారన్న దానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. పోలీసుల దాడుల నేపథ్యంలో నిర్మానుష్యంగా గణేష్‌నగర్ మారిపోయింది. డాక్టర్ స్వామి ఎవరన్నదానిపై పోలీసులు విచారణ […]

యాదాద్రి: మైనర్‌ల కిడ్నాప్, వ్యభిచారం కేసులో బాలికలకు ఇంజక్షన్లు ఇచ్చిన డాక్టర్ స్వామి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ప్రాథమిక విచారణలో డాక్టర్ స్వామి పేరును నిందితులు వెల్లడించారు. దీంతో డాక్టర్ పట్టుబడితే కీలక సమాచారం అందుతుందని పోలీసులు భావిస్తున్నారు. డాక్టర్ స్వామి పట్టుబడితే ఇప్పటి వరకు ఎంతమంది బాలికలకు ఇంజక్షన్లు ఇచ్చారన్న దానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. పోలీసుల దాడుల నేపథ్యంలో నిర్మానుష్యంగా గణేష్‌నగర్ మారిపోయింది. డాక్టర్ స్వామి ఎవరన్నదానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. వ్యభిచార ముఠా వద్ద మరికొంతమంది చిన్నారులు ఉన్నట్లు గుర్తించారు. ఈ ముఠా ఆధీనంలో ఉన్న చిన్నారుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. వ్యభిచార గృహాలకు అడ్డగా మారిన గణేష్‌నగర్‌పై పోలీసులు నిఘా పెట్టారు.

Comments

comments

Related Stories: