వ్యక్తి పై కత్తితో దాడి…

young man attacked the singer's worker with a knife
బెల్లంపల్లి: బెల్లంపల్లి పట్టణం కన్నాల బస్తీకి చెందిన జక్కం ధర్మయ్య అనే సింగరేణి కార్మికునిపై అదే బస్తీకి చెందిన ఏలూరి కార్తీక్ అనే యువకుడు శుక్రవారం రాత్రి కత్తితో దాడి చేశాడు. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం… బాధితునికి దాడికి పాల్పడిన యువకునికి మధ్యన చాలా సార్లు గొడవలు జరిగాయని, అదే దృష్టిలో ఉంచుకొని ఈ రోజు దాడికి పాల్పడినట్టు వారు తెలిపారు. పలు మార్లు బాధితున్ని బెదిరింపులకు పాల్పడిన యువకుడు శుక్రవారం కూడా అతిగా మధ్యం సేవించి అటుగా వెళ్తున్న ధర్మయ్యపై కత్తితో మెడపై దాడి చేయగా తీవ్ర రక్త శ్రావం కావడంతో అవస్మరక స్థితిలో కిందపడి పోగా అతన్ని వెంటనే బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్టు పేర్కొన్నారు. స్థానిక వైద్యులు ప్రాథమిక చికిత్స నిర్వహించి మెగురైన వైద్యం కోసం మంచిర్యాల రెఫర్ చేసినట్టు స్థానికులు తెలిపారు.

Comments

comments