వ్యక్తి దారుణ హత్య!

జయశంకర్‌ భూపాలపల్లి: కొందరు దుండగులు ఓ వ్యక్తిని అతి కిరాతకంగా నరికి చంపేసిన దారుణ ఘటన జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని మహదేవ్‌పూర్‌ మండలం ఎడపల్లిలో చోటుచేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు సంగిశెట్టి కిశోర్‌ అనే వ్యక్తిని దారుణంగా గొడ్డలితో నరికి చంపారు. కిశోర్ చనిపోయాడని నిర్ధారించుకున్న అనంతరం దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడిని ఎపిలోని తూర్పుగోదావరి జిల్లా సీతానగరం వాసిగా […]

జయశంకర్‌ భూపాలపల్లి: కొందరు దుండగులు ఓ వ్యక్తిని అతి కిరాతకంగా నరికి చంపేసిన దారుణ ఘటన జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని మహదేవ్‌పూర్‌ మండలం ఎడపల్లిలో చోటుచేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు సంగిశెట్టి కిశోర్‌ అనే వ్యక్తిని దారుణంగా గొడ్డలితో నరికి చంపారు. కిశోర్ చనిపోయాడని నిర్ధారించుకున్న అనంతరం దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడిని ఎపిలోని తూర్పుగోదావరి జిల్లా సీతానగరం వాసిగా పోలీసులు గుర్తించారు. కాగా, అతడు ఇసుక క్వారీలో సూపర్‌వైజర్‌గా విధులు నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇసుక మాఫియానే ఈ ఘాతుకానికి పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

comments

Related Stories: