వ్యక్తి దారుణ హత్య

Jayashankar Bhupalpally : Person Murdered

జయశంకర్ భూపాలపల్లి : రేగొండ మండలం పాండవుల గుట్ట సమీపంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం త్రోవకుంట గ్రామానికి చెందిన దుడ్డి యోసోబు, గాలి ప్రవీణ్‌కుమారలు విద్యుత్ సబ్ స్టేషన్‌ను నిర్మిస్తున్నారు. ఈ క్రమంలో వారు మద్యం సేవించారు. ప్రవీణ్‌కుమార్‌కు, యోసోబుకు మధ్య వివాదం తలెత్తింది. దీంతో ప్రవీణ్‌కుమార్ దుడ్డుకర్రతో యోసోబు తలపై కొట్టడంతో అతడు అక్కడికక్కడే చనిపోయాడు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

Person Murdered at Jayashankar Bhupalpally