వ్యక్తి దారుణ హత్య…

జయశంకర్ భూపాలపల్లి: తాగిన మైకంలో ఇద్దరి మధ్య జరిగిన ఘర్షణలో ఓ వ్యక్తి హత్యకు గురైన సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని రేంగొండ మండలంలోని పాండవుల గుట్ట సమీపంలో నిర్మాణంలో ఉన్న 33/11కెవి సబ్‌స్టేషన్ వద్ద జరిగింది. ఎపిలోని ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం త్రోవకుంట గ్రామానికి చెందిన దుడ్డి యోసోబు, గాలి ప్రవీన్‌కుమార్‌లు సబ్‌స్టేషన్ నిర్మాణ పనుల కోసం మరికొంత మంది గ్రామస్థులతో కలిసి వచ్చారు. పనుల అనంతరం మద్యం తాగుతుండగా యోసోబుకు గాలి ప్రవీణ్‌కుమార్‌ మధ్య ఘర్షణ […]

జయశంకర్ భూపాలపల్లి: తాగిన మైకంలో ఇద్దరి మధ్య జరిగిన ఘర్షణలో ఓ వ్యక్తి హత్యకు గురైన సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని రేంగొండ మండలంలోని పాండవుల గుట్ట సమీపంలో నిర్మాణంలో ఉన్న 33/11కెవి సబ్‌స్టేషన్ వద్ద జరిగింది. ఎపిలోని ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం త్రోవకుంట గ్రామానికి చెందిన దుడ్డి యోసోబు, గాలి ప్రవీన్‌కుమార్‌లు సబ్‌స్టేషన్ నిర్మాణ పనుల కోసం మరికొంత మంది గ్రామస్థులతో కలిసి వచ్చారు. పనుల అనంతరం మద్యం తాగుతుండగా యోసోబుకు గాలి ప్రవీణ్‌కుమార్‌ మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. వాగ్వాదంలో మాటామాట పెరగడంతో మద్యం మత్తులో ఉన్న ప్రవీణ్‌కుమార్ పక్కనే ఉన్న కర్రతో యోసోబు తలపై కొట్టాడు. దాంతో యోసోబు తలకు తీవ్రగాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం మృతుని బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Related Stories: