వైన్స్‌షాపు పై మందు బాబుల ఆగ్రహం…

Alcohol lovers angry over the winescott staff

బాలానగర్‌: మండల కేంద్రంలోని ఓ వైన్స్ దుకాణంలో మండల కేంద్రానికి చెందిన ఓ మద్యం ప్రియుడు గురువారం మధ్యాహ్నం దుకాణం వద్దకు వెళ్లి ఆఫీసర్స్ చాయిస్ బ్రాండు గల మద్యం బాటిల్‌ను కొని సేవించే సమయంలో మద్యం సీసాలో చెత్తా చెదారం వుండటంతో అవాక్కయ్యాడు. వెంటనే మద్యం దుకాణంలో వున్న సిబ్బందిని ప్రశ్నించగా.. చెత్తతో కూడిన బాటిల్‌కు తమకు ఎలాంటి సంబంధం లేదని.. ఎవరికి చెప్పుకుంటారో.. చెప్పుకోండని నిర్లక్షంతో సమాధానమివ్వడంతో.. ఆగ్రహంతో అక్కడున్న మద్యం ప్రియులు షాపు ముందుర గుమిగూడి సిబ్బందిపై మండిపడుతూ… మద్యం బాటిల్లో చెత్త, చెదారాన్ని నింపి జనాల ప్రాణాలతో చెలగాటమాడతారా..? అని ప్రశ్నిస్తూ వారితో వాగ్వివాదానికి దిగగా… వైన్స్ వద్ద గందరగోళ వాతావరణం ఏర్పడింది. సమాచారం తెలుసుకున్న స్థానిక పోలీసులు కల్పించుకొని మద్యం ప్రియులను అక్కడినుండి పంపించిడం జరిగింది. జనాలు అక్కడినుండే సంఘటన గురించి ఫోన్‌లో ఆబ్కారీ అధికారులకు జనాలు ఫిర్యాదు చేయగా… హుటాహుటిన ఎక్సైజ్‌శాఖ సిఐ ఖలీల్ మండల కేంద్రానికి చేరుకొని వివాదాస్పద చెత్తతో కూడిన మద్యం బాటిల్‌ను స్వాధీనం చేసుకొని సంఘటనపై విచారిస్తామని పేర్కోన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా నాణ్యతతో కూడిన మద్యాన్ని జనాలకు అందజేసే విధంగా చర్యలు తీపుకోవాలని పలువురు కోరారు.