వైఎస్ జగన్ బర్త్‌డే కానుకగా…

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రాష్ట్ర రాజకీయాల్ని తిరగరాసిన డా.రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘యాత్ర’. వైఎస్‌ఆర్ రాజకీయ జీవితంలో పాదయాత్ర కీలక ఘట్టం. ఆ సమయంలో జరిగిన ముఖ్య సంఘటనల సమాహారమే ఈ చిత్రం. మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి వైఎస్‌ఆర్ పాత్రలో జీవిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్‌లుక్ టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. మహి వి.రాఘవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ బయోపిక్‌ను 70 ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై విజయ్ చిల్లా, శశి […]

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రాష్ట్ర రాజకీయాల్ని తిరగరాసిన డా.రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘యాత్ర’. వైఎస్‌ఆర్ రాజకీయ జీవితంలో పాదయాత్ర కీలక ఘట్టం. ఆ సమయంలో జరిగిన ముఖ్య సంఘటనల సమాహారమే ఈ చిత్రం. మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి వైఎస్‌ఆర్ పాత్రలో జీవిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్‌లుక్ టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. మహి వి.రాఘవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ బయోపిక్‌ను 70 ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డిలు నిర్మిస్తున్నారు. వైఎస్‌ఆర్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి బర్త్‌డే కానుకగా డిసెంబర్ 21న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డిలు మాట్లాడుతూ “మడమతిప్పని నాయకుడు వైఎస్‌ఆర్ పాత్రలో మమ్ముట్టి అద్భుతంగా నటిస్తున్నారు. మా బ్యానర్ నుంచి భలే మంచి రోజు, ఆనందోబ్రహ్మ వంటి సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి. ఇప్పుడు ‘యాత్ర’ హాట్రిక్ హిట్ చిత్రంగా నిలుస్తుందనే నమ్మకంతో ఉన్నాం. వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయ ప్రయాణంలో ఆయన చేసిన పాదయాత్ర చరిత్రలో నిలిచిపోయింది. ఆయన పోరాట పటిమ ఎంతోమందికి ఆదర్శంగా నిలిచింది. ఆ పాదయాత్రలో జరిగిన వాస్తవిక, భావోద్వేగ సంఘటనలతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి బర్త్ డే సందర్భంగా డిసెంబర్ 21న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తాం”అని అన్నారు. రావు రమేష్, జగపతిబాబు, సుహాసిని, అనసూయ, పోసాని, సచిన్ కడ్కర్, వినోద్‌కుమార్, జీవా, 30 ఇయర్స్ పృథ్వీ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌ః సత్యన్ సూర్యన్, మ్యూజిక్‌ః క్రిష్ట కుమార్, ఎడిటర్‌ః శ్రీకర్‌ప్రసాద్, సాహిత్యంః సిరివెన్నెల సీతారామశాస్త్రి.

Comments

comments