వేల ఏళ్లనాటి చేపకు కాలుష్య గండం

గాఢమైన నీలిరంగు, డైనోసార్ల కన్నా ముందటి తరానికి చెందిన, సరాసరి మరిసికన్నా బరువు కలిగిన ‘సీలకాంత్’ చేపలు దక్షిణాఫ్రికాలో అంతరించిపోతున్న ప్రాణుల జాబితాలో ఉన్నాయి. ప్రపంచంలోనే అరుదైన జాతి ఈ చేపలది. ఈ రకం చేపలు దక్షిణాఫ్రికా తూర్పు తీరంలో దాదాపు 30 మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆ ప్రాంతంలో కొన్ని చమురు బావుల తవ్వకం ఈ చేపల భవిష్యత్తును ప్రశ్నార్తకం చేస్తోంది. 420 మిలియన్ సంవత్సరాల నుండి ఈ చేపల ఆకారంలో ఏమాత్రం మార్పు రాలేదు. […]

గాఢమైన నీలిరంగు, డైనోసార్ల కన్నా ముందటి తరానికి చెందిన, సరాసరి మరిసికన్నా బరువు కలిగిన ‘సీలకాంత్’ చేపలు దక్షిణాఫ్రికాలో అంతరించిపోతున్న ప్రాణుల జాబితాలో ఉన్నాయి. ప్రపంచంలోనే అరుదైన జాతి ఈ చేపలది. ఈ రకం చేపలు దక్షిణాఫ్రికా తూర్పు తీరంలో దాదాపు 30 మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆ ప్రాంతంలో కొన్ని చమురు బావుల తవ్వకం ఈ చేపల భవిష్యత్తును ప్రశ్నార్తకం చేస్తోంది. 420 మిలియన్ సంవత్సరాల నుండి ఈ చేపల ఆకారంలో ఏమాత్రం మార్పు రాలేదు. 1938లో తూర్పు లండన్ రేవు పట్టణం వద్ద ఈ జాతి చేప సజీవంగా పట్టుబడినప్పుడు ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఆ తరువాత కొమొరస్ ద్వీపాల ప్రజలు 1950 ప్రాంతంలో వీటిని పట్టుకున్నారు. దీంతో ఈ జాతి చేపలు అంతరించిపోలేదన్న నిబ్బరం కలిగింది. 2000 డిసెంబర్‌లో కొంతమంది ఈతగాళ్లు ‘సీలకాంత్’ చిన్న చేపల కాలనీని దక్షిణాఫ్రికా సోడ్వానా ఖాతంలో గమనించారు. ఇప్పుడు రోమ్ కేంద్రమైన ఎనర్జీగ్రూపు ఎనిస్లాన్స్ 400కి.మీ పొడవునా అనేక చమురు బావులు తవ్వకాన్ని చేపట్టింది. చమురు కాలుష్యం విస్తరించితే ఈ చేపలు ప్రాణవాయువును పీల్చుకొనే సామర్థాన్ని కోల్పోతాయని పర్యావరణ ఉద్యమ కారులు చెబుతున్నారు.
– సైన్స్ విభాగం

Comments

comments