వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు దుర్మరణం

మంచిర్యాల: మంచిర్యాల జిల్లాలోని వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. శనివారం బొక్కలగుట్ట వద్ద లారీ బైక్‌పై బోల్తాపడడంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా కాసిపేట మండలం సోమగూడెం వద్ద బైక్‌ను లారీ ఢీకొనడంతో ఒక్కరు మృతి చెందారు. శనివారం జరిగిన రోడ్డు ప్రమాదాలు పలువురిని కలచివేశాయి. గద్దెరాగడి మూలమలుపు వద్ద శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరు గాయపడ్డారు. బెల్లంపల్లి వైపు నుంచి […]

మంచిర్యాల: మంచిర్యాల జిల్లాలోని వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. శనివారం బొక్కలగుట్ట వద్ద లారీ బైక్‌పై బోల్తాపడడంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా కాసిపేట మండలం సోమగూడెం వద్ద బైక్‌ను లారీ ఢీకొనడంతో ఒక్కరు మృతి చెందారు. శనివారం జరిగిన రోడ్డు ప్రమాదాలు పలువురిని కలచివేశాయి. గద్దెరాగడి మూలమలుపు వద్ద శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరు గాయపడ్డారు. బెల్లంపల్లి వైపు నుంచి కర్రలోడ్‌తో వస్తున్న లారీ, మంచిర్యాల నుండి బెల్లంపల్లి పైపు బైక్‌పై వెళ్తుండగా లారీ అదుపు తప్పి బైక్‌పై బోల్తా పడడంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మందమర్రి పట్టణానికి చెందిన బుర్ర శ్రీకాంత్ (27), అతని కుమారుడు బుర్ర కార్తీక్(04) మృతి చెందగా అతని భార్య రజిత, కుమార్తె అశితలు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. మంచిర్యాలలో షాపింగ్ చేసుకొని కుటుంబ సభ్యులతో మందమర్రికి వెళ్తుండగా బొక్కల గుట్ట వద్ద మొక్క జొన్న కంకుల కోసం రోడ్డు పక్కన బైక్‌ను నిలపగా భార్య, కూతురు బైక్ దిగి మొక్కజొన్న కంకుల కోసం వెళ్లగా శ్రీకాంత్, అతని కుమారుడు కార్తీక్‌లు బైక్‌పైనే ఉన్నారు. అయితే ఆ సమయంలోనే బెల్లంపల్లి వైపు నుండి లోడ్‌తో వస్తున్న లారీ మూల మలుపు వద్ద అదుపు తప్పి బైక్‌పై బోల్తా పడగా తండ్రి కుమారుడు అక్కడికక్కడే మృతి చెందారు. లారీ కింద వారి మృతదేహాలు నుజ్జు నుజ్జుగా మారాయి. లారీ రోడ్డుకు అడ్డంగా పడడంతో మంచిర్యాల, బెల్లంపల్లి రహదారిపై ట్రాఫిక్ స్తంభించి పోయింది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు లారీని పక్కకు తొలగించి రాకపోకలను పునరుద్దరించారు. ఈ మేరకు రామకృష్ణాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.

Related Stories: