వేర్వేరు ఘటనల్లో ఇద్దరు మృతి…

died-image

హైదరాబాద్: రెండు వేర్వేరు ప్రదేశాల్లో చోటుచేసుకున్న ఘటనల్లో విషాదాలు చోటుచేసుకున్నాయి. కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంట మండలం శాయంపేట గ్రామంలో ఇంటి ప్రక్కవాళ్లతో గొడ విషయంలో జరిగిన గొడవలో ఓ బాలింత మృతిచెందింది. గొడవ జరుగుతున్న సందర్భంలో ఆమె గట్టిగా అరిచింది దీంతో  బాలింత అపర్ణ(23)కు గుండెపోటు వచ్చింది. వెంటనే ఆమెను దవాఖానకు తరలించారు. అప్పటికే ఆమె చనిపోయిందని డాక్టర్లు వెల్లడించారు. అపర్ణ నెలరోజుల క్రితం ఒక పాపకు జన్మనిచ్చింది. అదేవిధంగా చొప్పదండి మండలంలోని గుమ్లాపూర్ గ్రామంలో ప్రయివేట్ పాఠశాల బస్సు కిందపడి ఉదారం మన్విత(4) అనే చిన్నారి మృత్యువాత పడింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

Comments

comments