వేగవంతంగా పనులు

జిల్లా కలెక్టర్ శరత్ మనతెలంగాణ/జగిత్యాల: జిల్లాకు మంజూరైన పనులను వేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ అ న్నారు. గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో మైనార్టీ సంక్షేమ కార్యక్రమాలపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో ముస్లిం, మైనార్టీ సంక్షేమం కోసం రూ.417లక్షలు మంజూరయ్యాయని, ఈ నిధులతో 49 పనులకు పరిపాలన మంజూరు ఇవ్వగా 16 పనులు పూర్తి కాగా మరో 24పనులు వివిధ దశల్లో […]

జిల్లా కలెక్టర్ శరత్

మనతెలంగాణ/జగిత్యాల: జిల్లాకు మంజూరైన పనులను వేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ అ న్నారు. గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో మైనార్టీ సంక్షేమ కార్యక్రమాలపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో ముస్లిం, మైనార్టీ సంక్షేమం కోసం రూ.417లక్షలు మంజూరయ్యాయని, ఈ నిధులతో 49 పనులకు పరిపాలన మంజూరు ఇవ్వగా 16 పనులు పూర్తి కాగా మరో 24పనులు వివిధ దశల్లో ఉన్నాయన్నారరు. ఇంకా 9పనులు ప్రారంభించాల్సి ఉందన్నారు. చర్చీల పనుల కోసం రూ.189లక్షలతో 50పనులు మంజూరు కాగా అందులో 18 పనులు ప్రగతిలో ఉన్నాయని, 32 ప నులు ప్రారంభ దశలో ఉన్నట్లు తెలిపారు. ప్రారంభం కాని పనులను వెంటనే ప్రారంభించి ఆగస్టు 31 లోగా పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. అధికారులు పక్షం రోజులకు ఒక సారి పర్యవేక్షించి పనులను వేగవంతం చేయాలన్నారు.
అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. పంచాయతీరాజ్ శాఖ ద్వారా వివిధ పథకాల ద్వా రా రూ.436.67కోట్లతో 8830 పనులు మంజూరయ్యాయని, అందులో రూ.60.50కోట్ల నిధులతో 1961 పను లు పూర్తి చేయడం జరిగిందన్నారు. మిగిలిన పనులు సకాలంలో పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.మొదటి విడతలో మంజూరైన డబుల్ బెడ్ రూం ఇండ్లకు టెండర్ ప్రక్రియ పూర్తయినా పనులు ప్రా రంభించని కాంట్రాక్టర్లకు నోటీసులు జారీ చేసి వారిని బ్లా క్ లిస్టులో పెట్టాలన్నారు. డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, సకాలంలో పనులు పూర్తి చేసిన కాంట్రాక్టర్లకు వెంటనే బిల్లులు చెల్లిస్తామన్నారు. ఈ సమావేశంలో ఆర్‌డిఓ నరేందర్, పంచాయతీరాజ్ శాఖ ఇఇ మనోహర్‌రెడ్డి, డిఇలు రాజేశ్వర్, శంకరయ్య, గోపాల్, శ్రీనివాస్, మజీద్, చర్చి కమిటీల అధ్యక్షుడు, సభ్యులు పాల్గొన్నారు.

Comments

comments

Related Stories: