వెల్‌కమ్ టు ప్యాసింజర్స్

చెన్నై విమానాశ్రయంలో ప్యాసింజర్లకు సహకరించడానికి కొత్తగా ఇద్దరిని నియమిం చారు. వీరు మామూలు సిబ్బంది అనుకుంటే పొరపాటే. మానవాకార రోబోలు అవి. విమానాశ్రయంలోని టెర్మినల్స్‌లో ప్యాసింజర్లకు ఇవి సహాయ పడుతుంటాయి. ఈ రెండు రోబోలను డిపార్చర్, ఎరైవల్ హాల్స్‌లో డొమిస్టిక్ టెర్మినల్‌లో ప్రవేశపెట్టారు. ఇంటర్నేషనల్ టెర్మినల్ వద్ద కూడా రోబోలను ప్రవేశపెడతామని ఎయిర్‌పోర్టు అథా రిటీ ఆఫ్ ఇండియా(ఎఎఐ) అధికారులు చెప్పారు. ఇప్పుడు రెండు రోబోలను  ట్రయిల్ బేసిస్‌లో ప్రవేశపెట్టాం. అవి టెర్మినల్ అంతా నడుస్తాయి, ప్యాసింజర్లను […]

చెన్నై విమానాశ్రయంలో ప్యాసింజర్లకు సహకరించడానికి కొత్తగా ఇద్దరిని నియమిం చారు. వీరు మామూలు సిబ్బంది అనుకుంటే పొరపాటే. మానవాకార రోబోలు అవి. విమానాశ్రయంలోని టెర్మినల్స్‌లో ప్యాసింజర్లకు ఇవి సహాయ పడుతుంటాయి. ఈ రెండు రోబోలను డిపార్చర్, ఎరైవల్ హాల్స్‌లో డొమిస్టిక్ టెర్మినల్‌లో ప్రవేశపెట్టారు. ఇంటర్నేషనల్ టెర్మినల్ వద్ద కూడా రోబోలను ప్రవేశపెడతామని ఎయిర్‌పోర్టు అథా రిటీ ఆఫ్ ఇండియా(ఎఎఐ) అధికారులు చెప్పారు. ఇప్పుడు రెండు రోబోలను  ట్రయిల్ బేసిస్‌లో ప్రవేశపెట్టాం.

అవి టెర్మినల్ అంతా నడుస్తాయి, ప్యాసింజర్లను విష్ చేస్తాయి. వారితో మాట్లాడతాయి. కొన్ని రోజుల్లో అవి ప్యాసింజర్లకు ఎలాంటి చిక్కులొచ్చినా సహాయపడేలా ప్రోగ్రాం చేస్తాం. అలాగే సెక్యూరిటీ చెక్‌ల దగ్గర గైడ్ చేయిస్తాం  అని అధికారి ఒకరు పేర్కొన్నారు. ఈ రోబోలను చూడడానికి కొంతమంది ఎంతో ‘థ్రిల్’ ఫీలయ్యారు. జర్మనీ వంటి అంతర్జాతీయ విమానాశ్రయాల్లో మానవాకార రోబోను ప్రవేశపెట్టారు. దానిపేరు ‘జోసీ పెప్పర్’. ఢిల్లీ విమానాశ్రయం  కూడా రోబోను ప్రవేశపెట్ట డానికి ప్లాను తయారు చేసింది. దానిపేరు “రాడా”.

Comments

comments

Related Stories: