వెరైటీ లుక్‌లో రజనీకాంత్

సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ మెడికల్  చెకప్ కోసం అమెరికా వెళ్లాడు. రెండు వారాల పాటు ఆయన అక్కడ ఉంటాడు. అమెరికాలో దిగగానే రజనీ తన గెటప్‌ను పూర్తిగా మార్చేశాడు. యూత్ తరహాలో వెరైటీ లుక్‌లో స్టైలిష్‌గా కనిపించాడు. బ్లాక్ కలర్ టీషర్ట్, గాగుల్స్, వెరైటీ  బ్యాగ్‌తో మొత్తం తన గెటప్‌ని మార్చేశాడు తలైవా. మెట్రో రైలులో ప్రయాణిస్తుండగా ఓ అభిమాని క్లిక్‌మనిపించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అమెరికాలో రజనీకాంత్ ఈవిధంగా కనిపించడం […]

సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ మెడికల్  చెకప్ కోసం అమెరికా వెళ్లాడు. రెండు వారాల పాటు ఆయన అక్కడ ఉంటాడు. అమెరికాలో దిగగానే రజనీ తన గెటప్‌ను పూర్తిగా మార్చేశాడు. యూత్ తరహాలో వెరైటీ లుక్‌లో స్టైలిష్‌గా కనిపించాడు. బ్లాక్ కలర్ టీషర్ట్, గాగుల్స్, వెరైటీ  బ్యాగ్‌తో మొత్తం తన గెటప్‌ని మార్చేశాడు తలైవా. మెట్రో రైలులో ప్రయాణిస్తుండగా ఓ అభిమాని క్లిక్‌మనిపించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అమెరికాలో రజనీకాంత్ ఈవిధంగా కనిపించడం కొత్తేమీ కాదు. గతంలో ‘కబాలి’ విడుదలకు ముందు యుఎస్ వెళ్లిన ఆయన అక్కడి రోడ్ల మీద నడుచుకుంటూ వెళ్లి సందడి చేశాడు. అప్పట్లో దీనికి సంబంధించిన వీడియో ఓ రేంజ్‌లో సోషల్ మీడియాలో హంగామా చేసింది. ఇక రజనీకాంత్ నటించిన ‘కాలా’ జూన్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. అమెరికా నుంచి రాగానే ఆయన ఈ మూవీ ప్రమోషన్‌లో పాల్గొంటాడు.

Comments

comments

Related Stories: