వెదురుతో వంతెన !

వెదురు వంతెన ఏమిటా అనుకుంటున్నారా? ఏడాదికొకసారి పాతది తొలగించి కొత్తగా కడతారట. ఈ వెదురు కర్రల వంతెన కాంబోడియాలో ఉంది. కాంబోడియాలో మెకాంగ్ నది మధ్యలో కొహ్‌పెన్ అని చిన్న దీవి ఉంది. కపాంగ్ చామ్ పట్టణం నుంచి ఆ దీవికి వెళ్లడానికి శాశ్వత వంతెన లేదు. అక్కడి ప్రజలే సీజన్‌ను బట్టి వెదురు కర్రలతో వంతెన నిర్మించుకుంటారు.వ ర్షాకాలం వెళ్లాక  నదిలో నీటిమట్టం తగ్గినాక ఈ వంతెనను నిర్మించుకుంటారు. వచ్చే సంవత్సరం మళ్లీ వర్షా కాలం […]

వెదురు వంతెన ఏమిటా అనుకుంటున్నారా? ఏడాదికొకసారి పాతది తొలగించి కొత్తగా కడతారట. ఈ వెదురు కర్రల వంతెన కాంబోడియాలో ఉంది. కాంబోడియాలో మెకాంగ్ నది మధ్యలో కొహ్‌పెన్ అని చిన్న దీవి ఉంది. కపాంగ్ చామ్ పట్టణం నుంచి ఆ దీవికి వెళ్లడానికి శాశ్వత వంతెన లేదు. అక్కడి ప్రజలే సీజన్‌ను బట్టి వెదురు కర్రలతో వంతెన నిర్మించుకుంటారు.వ ర్షాకాలం వెళ్లాక  నదిలో నీటిమట్టం తగ్గినాక ఈ వంతెనను నిర్మించుకుంటారు. వచ్చే సంవత్సరం మళ్లీ వర్షా కాలం బిగిన్ అయినప్పుడు నది ఉప్పొంగే సమయానికి వంతెన తొలగిస్తారు. అలా కొన్ని దశాబ్దాలుగా చేస్తూనే ఉన్నారు . వెదురుకర్రలతో చేసినవంతెన అయినా చాలా బలంగా ఉంటుంది. నాలుగు టన్నుల వరకు బరువున్న వాహనాలు వెళ్లవచ్చు. ఈ వంతెనపై ప్రయాణించడానికి ఏటా వేల మంది పర్యాటకులు వస్తుంటారు. విదేశీయులు కూడా ఈ వంతెనను చూడటానికి వస్తూ ఉంటారుట. కానీ వాళ్ళదగ్గరనుండి సాధారణ రుసుము కంటే  నలభై రెట్లు ఎక్కువ రుసుము వసూలు చేస్తారుట.  ఈ రుసుమును వంతెన నిర్మాణ వ్యయంకోసం వాడుకుంటున్నారుట.  బావుంది కదా ఈ ఏడాదికో కొత్త వంతెన.

Comments

comments