వృద్ధి శిఖరాగ్రం

దేశంలోనే అత్యధికంగా గత ఐదు నెలల్లో 21.96% ఆదాయ వృద్ధిని సాధించిన తెలంగాణ గత ఆర్థిక సంవత్సరం తొలి ఐదు నెలల్లో రూ. 21,642.02 కోట్లు ఆదాయం మన తెలంగాణ / హైదరాబాద్ : గడిచిన నాలుగేళ్లుగా ఆదాయాభివృద్దిలో గణనీయ ప్రగతిని సాధిస్తున్న తెలంగాణ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అంతకంటే మెరుగైన ఫలితాలను సాధించింది. గత ఆర్థిక సంవత్సరం మొదటి ఐదు నెలల్లో (ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు) 21,642.02 కోట్ల రూపాయల ఆదాయం ఆర్జించగా ప్రస్తుత […]

దేశంలోనే అత్యధికంగా గత ఐదు నెలల్లో 21.96% ఆదాయ వృద్ధిని సాధించిన తెలంగాణ
గత ఆర్థిక సంవత్సరం తొలి ఐదు నెలల్లో
రూ. 21,642.02 కోట్లు ఆదాయం

మన తెలంగాణ / హైదరాబాద్ : గడిచిన నాలుగేళ్లుగా ఆదాయాభివృద్దిలో గణనీయ ప్రగతిని సాధిస్తున్న తెలంగాణ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అంతకంటే మెరుగైన ఫలితాలను సాధించింది. గత ఆర్థిక సంవత్సరం మొదటి ఐదు నెలల్లో (ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు) 21,642.02 కోట్ల రూపాయల ఆదాయం ఆర్జించగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అదే ఐదు నెలల కాలానికి రూ. 26,394.18 కోట్లను ఆర్జించింది. గతేడాదికంటే ఎక్కువ వృద్ధి రేటును నమోదు చేసిందని, నాలుగేళ్ళతో పోలిస్తే ఈ సంవత్సరం ఫలితాలు మరింత మెరుగ్గా ఉన్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసిన ప్రకటన పేర్కొనింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 5 నెల ల్లో రాష్ట్ర ఆదా యం ఆర్జించడంలో 21.96 శాతం వృద్ధి రేటు సాధించినట్లు తెలిపింది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత మొదటి నాలుగు సంవత్సరాలలో ఏడాదికి సగటున 17.17 ఆదాయ వృద్దిరేటు నమో దు చేసిందని, ఈ ఏడాది మాత్రం ఐదు నెలల వ్యవధిలోనే 21.96% వృద్ధి నమోదైనట్లు పేర్కొనింది. ఇంత భారీస్థాయిలో స్థిరమైన ఆదాయాభివృద్ది సాధిస్తున్న మొదటి రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం రికార్డు సృష్టిస్తున్నదని ముఖ్యమం త్రి కార్యాలయం ఆ ప్రకటనలో పేర్కొనింది.
ప్రారంభం నుంచీ
మెరుగైన వృద్ధిరేటు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది మొదలు తొలి ఏడాది నుంచే ఆర్థిక ఆదాయ వనరుల పెంపులో మరే రాష్ట్రంకంటే మెరుగైన పనితీరు కనబరుస్తూ వృద్ధి రేటును సొంతం చేసుకుంది. ప్రతీ ఏటా వృద్ధి రేటు గణనీయంగా పెరుగుతూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి 5 నెలల్లోనే ఊహించనంత అభివృద్ధి సాధించింది. నీతి ఆయోగ్ సైతం తెలంగాణ ఆర్థిక ప్రగతిని గతంలో ప్రశంసించింది. రాష్ట్ర జిడిపి (జిఎస్‌డిపి) వృద్ధిరేటులో అన్ని రాష్ట్రాలకంటే, జాతీయ సగటుకంటే, కేం ద్ర జిడిపికంటే ముందు వరుసలో ఉన్న తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు ఆదాయ ఆర్జనలోనూ గత నాలుగేళ్ళ రికార్డును బద్దలుకొట్టింది.

Comments

comments

Related Stories: