వృత్తిపట్ల అంకిత భావమే గర్భిణీని కాపాడింది….

చర్ల: ఏఎన్‌ఎం కు వృత్తిపట్ల అంకిత భావం ఉండటంతో బుధవారం ముగ్గురి ప్రాణాలను కాపాడింది. బట్టిగూడెం గ్రామానికి చెందిన మడివి దేవి అనే గర్భిణీకి నొప్పులు రావడంతో సెకండ్ ఏఎన్‌ఎం రాజేశ్వరి గర్భిణీకి పురుడు పోసింది. మడివి దేవికి కవలు జన్మించారు. తల్లి, బిడ్డల ప్రాణాలను కాపాడేందుకు ఏఎన్‌ఎం రాజేశ్వరి ధైర్యం చేసి దేవి భర్త ఉంగయ్య సహాయంతో తానే స్వయంగా జెడ్డీ మోసుకుంటూ బట్టిగూడెం నుండి పెద్దమిడిసిలేరు వరకు తీసుకొచ్చింది. అనంతరం తల్లి బిడ్డలను సత్యనారాయణపురం […]

చర్ల: ఏఎన్‌ఎం కు వృత్తిపట్ల అంకిత భావం ఉండటంతో బుధవారం ముగ్గురి ప్రాణాలను కాపాడింది. బట్టిగూడెం గ్రామానికి చెందిన మడివి దేవి అనే గర్భిణీకి నొప్పులు రావడంతో సెకండ్ ఏఎన్‌ఎం రాజేశ్వరి గర్భిణీకి పురుడు పోసింది. మడివి దేవికి కవలు జన్మించారు. తల్లి, బిడ్డల ప్రాణాలను కాపాడేందుకు ఏఎన్‌ఎం రాజేశ్వరి ధైర్యం చేసి దేవి భర్త ఉంగయ్య సహాయంతో తానే స్వయంగా జెడ్డీ మోసుకుంటూ బట్టిగూడెం నుండి పెద్దమిడిసిలేరు వరకు తీసుకొచ్చింది. అనంతరం తల్లి బిడ్డలను సత్యనారాయణపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి వైద్య సేవలు అందజేశారు. రహదారి సౌకర్యం లేని గ్రామాలకు ప్రతి రోజూ కాలినడకన వెళుతూ గిరిజనుల ఆరోగ్యాల పట్ల శ్రద్ద తీసుకుంటున్న రాజేశ్వరిని వైద్య ఆరోగ్య శాఖ కమీషనర్ వాతాటి కరుణ ప్రశంసించారు.

Comments

comments

Related Stories: