విషాహారం తిని 43నెమళ్లు మృతి

చెన్నయ్ : విషాహారం తిని 43 నెమళ్లు మృతి చెందాయి. ఈ ఘటన మధురై సమీపంలో శనివారం జరిగింది. మృతి చెందిన నెమళ్లను పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిర్వహించారు. మృతి చెందిన నెమళ్లలో 34 ఆడ, 9 మగవి ఉన్నాయి. విషాహారం తినడం వల్లనే ఈ నెమళ్లు మృతి చెందాయని మధురై అటవీ ప్రాంత రేంజ్ అధికారి ఆర్ముగం తెలిపారు. విషంతో కూడిన వరిగింజలనుతినడం వల్లనే ఈ నెమళ్లు మృతి చెందినట్టు పోస్టుమార్టం తేలిందని ఆయన […]

చెన్నయ్ : విషాహారం తిని 43 నెమళ్లు మృతి చెందాయి. ఈ ఘటన మధురై సమీపంలో శనివారం జరిగింది. మృతి చెందిన నెమళ్లను పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిర్వహించారు. మృతి చెందిన నెమళ్లలో 34 ఆడ, 9 మగవి ఉన్నాయి. విషాహారం తినడం వల్లనే ఈ నెమళ్లు మృతి చెందాయని మధురై అటవీ ప్రాంత రేంజ్ అధికారి ఆర్ముగం తెలిపారు. విషంతో కూడిన వరిగింజలనుతినడం వల్లనే ఈ నెమళ్లు మృతి చెందినట్టు పోస్టుమార్టం తేలిందని ఆయన చెప్పారు. ఉద్దేశపూర్వకంగా వీటికి విషాహారం పెట్టి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఘటనాస్థలి నుంచి సేకరించిన 30 ఆహార నమూనాలను పరీక్ష కోసం ఫోరెన్సిక్ ల్యాబ్‌తో పాటు మద్రాస్ వెటర్నరీ కాలేజీకి పంపారు. జాతీయ వన్యప్రాణి సంరక్షణ చట్టం-1972 ప్రకారం నెమళ్లను చంపడం నేరమని, దీనికి ఏడేళ్ల వరకు జైలు శిక్షతోపాటు నగదు జరిమానా కూడా విధించే అవకాశం ఉందని వారు వెల్లడించారు.

43 Peacocks died with Eating Poison Food

Comments

comments

Related Stories: