విషపు గుళికలు తిని 13 నెమళ్లు మృత్యువాత

13 Peacock killed with eating poisoning seeds in manavapadu mandala

మానవపాడు: పంట పొల్లాలో విషపు గుళికలు తిని 13 నెమళ్లు మృతి చెందిన సంఘటన మానవపాడు మండలంలో కలకలం రేగింది. మండంలోని మానవపాడు, చెన్నిపాడు, గోకులపాడు, నారాయణపురం గ్రామాల్లో ఖరీఫ్ సిజన్ సందర్భంగా రైతులు పొల్లాలో పత్తి విత్తనాలు వేశారు. అయితే పొల్లాలో వేసిన విత్తనాలను ఎలుకలు తిన్నడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో రైతులు ఎలుకల పీడ తొలిగించుకొవాలని పొల్లాలో విషపు గుళికలు వేయడంతో గురువారం రాత్రి అయా గ్రామాల్లో ఉన్న పొలాల్లో కిటకాలు తినేందుకు వచ్చిన నెమళ్లు ఆ విషపు గుళికలు తినడంతో అక్కడికక్కడే మృతి చెందాయి. దీంతో శుక్రవారం ఉదయం పొలాలకు వెళ్లిన రైతులు మృతి చెందిన నెమళ్లను గుర్తించి అటవి శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో అటవి శాఖ జిల్లా అధికారి బాబ్‌జీరావు, రవికాంత్, సిబ్బందిలు సంఘటన స్థలానికి చేరుకుని మృతి చెందిన నెమళ్లను పరిశీలించారు. ఇక్కడ నెమళ్లు ఉన్నట్టు గుర్తించామని వాటి కోసం నీటి తొట్లను ఏర్పాటు చేస్తామని అన్నారు. అనంతరం మృతి చెందిన నెమళ్లను పోస్ట్‌మార్టం నిమిత్తం జిల్లా కేంద్రానికి తరలించారు. ఈ కార్యక్రమంలో రైతులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.