‘విశ్వ‌రూపం 2’తెలుగు ట్రైల‌ర్ చూశారా..?

హైదరాబాద్: విలక్షణ నటుడు కమల్‌హాసన్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన  ‘విశ్వ‌రూపం’ చిత్రం 2013లో వ‌చ్చి మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సీక్వెల్ గా వస్తున్న ‘విశ్వరూపం 2’ మూవీ తెలుగు ట్రైలర్ తాజాగా విడుదలైంది. మరోసారి కమల్ తనదైన నటనతో విశ్వరూపం చూపించారు. గురువారం సాయంత్రం హైద‌రాబాద్‌లో విశ్వ‌రూపం 2 మూవీ తెలుగు వ‌ర్షెన్‌కి సంబంధించి ఆడియో వేడుక నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా తెలుగు వ‌ర్షెన్ ట్రైల‌ర్ విడుద‌ల చేశారు. తెలుగు, తమిళం, హిందీ భాషలలో విడుదల కానున్న ఈ చిత్రంలో రాహుల్ […]

హైదరాబాద్: విలక్షణ నటుడు కమల్‌హాసన్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన  ‘విశ్వ‌రూపం’ చిత్రం 2013లో వ‌చ్చి మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సీక్వెల్ గా వస్తున్న ‘విశ్వరూపం 2’ మూవీ తెలుగు ట్రైలర్ తాజాగా విడుదలైంది. మరోసారి కమల్ తనదైన నటనతో విశ్వరూపం చూపించారు. గురువారం సాయంత్రం హైద‌రాబాద్‌లో విశ్వ‌రూపం 2 మూవీ తెలుగు వ‌ర్షెన్‌కి సంబంధించి ఆడియో వేడుక నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా తెలుగు వ‌ర్షెన్ ట్రైల‌ర్ విడుద‌ల చేశారు. తెలుగు, తమిళం, హిందీ భాషలలో విడుదల కానున్న ఈ చిత్రంలో రాహుల్ బోస్, పూజా కుమార్, ఆండ్రియా, నాజ‌ర్‌ ఇతర కీలక పాత్రల్లో నటించారు. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ గీబ్రాన్ ఈ చిత్రానికి స్వరాలు అందించారు. ఆగ‌స్టు 10వ తేదీన మూవీ ప్రపంచవ్యాప్తంగా విడుద‌ల కానుంది. ఇంకేందుకు ఆలస్యం తాజాగా విడుదలైన ‘విశ్వరూపం 2’ ట్రైలర్ పై మీరూ ఓ లుక్కేయండి.