విశేష ఉపాధి కల్పనకు మార్గం గ్రామీణ పునరుద్ధరణే

ఉపాధి లేకపోవటం వల్ల కలిగే సామాజిక పర్యవసానాలు ఎంతో తీవ్రమైనవి. పనీపాటలేకుండా తిరిగే యువత వల్ల అనేక సామాజిక కల్లోలాలు సంభవిస్తున్నాయి. మానభంగం కేసులు, మత హింస, సామాన్య ప్రజలను చిత్రహింసలు పెట్టటం, ఆత్మహత్యలు వగైరా పెరుగుదలలో అవి వ్యక్తీకరణ పొందుతున్నాయి. అందువల్ల ప్రభుత్వంలోనేగాక ప్రైవేటు రంగంలో ఉపాధి అవకాశాల పెంపుదలకు ఆర్థిక ప్రణాళిక అవసరం. నియత, అనియత రంగాల్లో ఉద్యోగావకాశాలు పెంపొందిస్తే ప్రజలకు లాభదాయక ఉపాధి లభిస్తుంది. విద్య, ఆరోగ్య రంగాల్లో తక్షణం చర్యలు తీసుకోవచ్చు.  […]

ఉపాధి లేకపోవటం వల్ల కలిగే సామాజిక పర్యవసానాలు ఎంతో తీవ్రమైనవి. పనీపాటలేకుండా తిరిగే యువత వల్ల అనేక సామాజిక కల్లోలాలు సంభవిస్తున్నాయి. మానభంగం కేసులు, మత హింస, సామాన్య ప్రజలను చిత్రహింసలు పెట్టటం, ఆత్మహత్యలు వగైరా పెరుగుదలలో అవి వ్యక్తీకరణ పొందుతున్నాయి. అందువల్ల ప్రభుత్వంలోనేగాక ప్రైవేటు రంగంలో ఉపాధి అవకాశాల పెంపుదలకు ఆర్థిక ప్రణాళిక అవసరం. నియత, అనియత రంగాల్లో ఉద్యోగావకాశాలు పెంపొందిస్తే ప్రజలకు లాభదాయక ఉపాధి లభిస్తుంది. విద్య, ఆరోగ్య రంగాల్లో తక్షణం చర్యలు తీసుకోవచ్చు. 

ఉపాధి కల్పన గత కొద్ది సంవత్సరాల్లో కనీస స్థాయిలో ఉన్నట్లు గణాంకాలు తెలుపుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లోనే 24 లక్షల ఖాళీలున్నాయన్న సమాచారం ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతున్నది. రాజ్యసభలో ఒక ప్రశ్నకు ఇచ్చిన లిఖిత సమాధానం ప్రకారం ప్రాథమిక, మాధ్యమిక స్కూళ్లల్లో టీచర్ల ఖాళీలు 10లక్షలకు పైగా ఉన్నాయి. ఆ తర్వాత పోలీసు శాఖలో 5.4 లక్షలు, రైల్వేల్లో 2.4 లక్షలు ఖాళీలున్నాయి.విద్యకు ప్రాథమిక హక్కు ప్రతిపత్తి ఇచ్చినందున టీచర్ ఉద్యోగాలు ఇంత పెద్ద ఎత్తున ఖాళీ ఉం డటం ఆకాంక్షిత లక్షసాధనకు పెద్ద ఆటంకం అవుతుంది.

పోలీసుకు సంబంధించి, పోలీసు జనాభా దామాషా అతి తక్కువ ఉన్న దేశాల్లో భారత్ ఒకటి. చట్టం న్యాయం సమస్యల విస్తృత పరిధిలో చూచినపుడు, కేసుల పెండింగ్‌కు, పనిభారంతో ఆషామాషీగా చేసే దర్యాప్తుల వల్ల శిక్షల విధించే శాతం తక్కువగా ఉండటానికి ప్రధాన కారణాల్లో ఇదొకటి. కొరత ఉన్న మరొక రంగం ఆరోగ్య కేంద్రాలు. డాక్టర్లు, నర్సులు, సాంకేతిక సిబ్బంది, ఇతర స్టాఫ్‌కు తీవ్రమైన కొరత ఉంది. దీనివల్ల సమాజంలోని పేదలకు వైద్య సేవలు అందించటం వెనకబడుతున్నది.

ప్రభుత్వంలో, అలాగే ప్రైవేటు రంగంలో తగినంత రిక్రూట్‌మెంట్ లేకపోవటం తీవ్రంగా ఆందోళన కలిగించే విషయం. విద్య విస్తరిస్తున్నప్పటికీ అందుకు తగినట్లు విద్యావంతులైన యువతకు ఉద్యోగాలు లభించటం లేదు. ఒక ఇటీవలి సర్వే ప్రకారం, ఎఐసిటిఇ ఆమోదించిన హోటల్ మేనేజిమెంట్, క్యాటరింగ్ కాలేజీల్లో ఉత్తీర్ణులైన 11 వేల మందికిపైగా విద్యార్థుల్లో 77 శాతం ఉద్యోగాలు పొందగా, ఇంజినీర్లు, టెక్నాలజీ పట్టభద్రుల్లో 40 శాతానికి మాత్రమే ఉపాధి లభించింది. ఆర్కిటెక్ట్‌లు, టౌన్ ప్లానింగ్ పట్టభద్రుల్లో కేవలం 35 శాతానికే రిక్రూట్‌మెంట్ లభించింది. పెద్ద చదువులు చదివిన వారి పరిస్థితే ఇలా ఉంటే స్కూలు విద్య, వృత్తి విద్యా కోర్సులు చేసినవారి పరిస్థితి మరీ దారుణం. పారిశ్రామిక కార్యకలాపాలు పెరుగుదల, వ్యవసాయం బహుముఖీకరణ గూర్చి ఎన్ని కబుర్లు చెబుతున్నా అవి ఉపాధి కల్పనలోకి మారటం లేదు. అందువల్ల ఉపాధి రహిత అభివృద్ధి గూర్చి మనం వింటున్నాం. పని చేయగలిగిన వయస్సులో చాలా హెచ్చు జనాభా ఉన్న భారత్ వంటి దేశానికి ఇది ప్రమాదకరం.

అయితే 2018 జనవరిలో నాస్కాం నివేదిక నాలుగు ప్రధాన రంగాల్లో ఉపాధి కల్పనను పొందుపరిచింది. అవి ఆటో మోటివ్, ఐటి బిపిఎం, రిటైల్, టెక్స్‌టైల్స్. 20142017 మధ్య ఈ నాలుగు రంగాల్లోనే 1.4 కోట్ల ఉద్యోగాలు కల్పించబడినాయి. రిటైల్ రంగం ఒక్కటే 65 లక్షల కొత్త ఉద్యోగాలిచ్చింది. అలాగే కెపిజిఎం ట్రావెల్ టూరిజం రంగాన్ని విశ్లేషించి ఈ రంగం ఏటా 16 శాతం వృద్ధి చెందుతోందని, ఏటా 3040 లక్షల మధ్య కొత్త ఉద్యోగాలు కల్పిస్తుందని చెప్పింది. ఇ కామర్స్, ఏవియేషన్, మొబిలిటీ సర్వీసులు, ఆగ్రో ప్రాసెసింగ్ వంటి అనేక కొత్త పరిశ్రమల్లో ఉపాధి కల్పన సాంప్రదాయక ఉద్యోగ కల్పన గణాంకాల్లో చోటు చేసుకోవటం లేదని అది తెలిపింది. అయితే వీటిని పరిగణనలోకి తీసుకున్నా ఉద్యోగ కల్పన సాధారణం కన్నా చాలా తక్కువగానే ఉంది.

ఉద్యోగావకాశాలు కొరవడటానికి ప్రధాన కారణం గ్రామాలు, పాక్షిక పట్టణ ప్రాంతాల్లో అభివృద్ధి నామమాత్రంగా ఉండటం. భారతదేశ ప్రణాళికల్లో గత కొద్ది దశాబ్దాలుగా పట్టణ పక్షపాతం ఇందుకు మూలం. ఉద్యోగావకాశాలు వృద్ధి చేయటానికి అనేక సంవత్సరాలుగా గట్టి ప్రయత్నం లేదు. దీన్నొక గంభీరమైన సమస్యగా ప్రభుత్వాలు చూడటం లేదు. అంతేగాక యాంత్రీకరణ ధోరణులు పరిశ్రమల్లోనేగాక వ్యవసాయంలో కూడా పెరగటం ఇటువంటి తీవ్రమైన పరిస్థితికి దారి తీసింది.

దీన్ని ఆర్థిక సమస్యగా సాధారణంగా చూస్తుంటారు. ఉపాధి లేకపోవటం వల్ల కలిగే సామాజిక పర్యవసానాలు ఎంతో తీవ్రమైనవి. పనీపాటలేకుండా తిరిగే యువత వల్ల అనేక సామాజిక కల్లోలాలు సంభవిస్తున్నాయి. మానభంగం కేసులు, మత హింస, సామాన్య ప్రజలను చిత్రహింసలు పెట్టటం, ఆత్మహత్యలు వగైరా పెరుగుదలలో అవి వ్యక్తీకరణ పొందుతున్నాయి. అందువల్ల ప్రభుత్వంలోనేగాక ప్రైవేటు రంగంలో ఉపాధి అవకాశాల పెంపుదలకు ఆర్థిక ప్రణాళిక అవసరం. నియత, అనియత రంగాల్లో ఉద్యోగావకాశాలు పెంపొందిస్తే ప్రజలకు లాభదాయక ఉపాధి లభిస్తుంది. విద్య, ఆరోగ్య రంగాల్లో తక్షణం చర్యలు తీసుకోవచ్చు. అలాగే గ్రామీణ పునరుజ్జీవనం, ఉపాధి కల్పన మధ్య సంబంధముంది. గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక పునరుజ్జీవన కార్యకలాపాలను సీరియస్‌గా చేబడితే ఉపాధి అవకాశాలు సామాజిక, భౌతిక మౌలిక వసతులను మెరుగుపరుస్తాయి.

ఢిల్లీ ఐఐటిలో మాదిరిగా అన్ని ఐఐటిల్లో గ్రామీణాభివృద్ధి టెక్నాలజీ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఐఐటి కౌన్సిల్ ఇటీవల ప్రణాళిక రచించింది. ఆ కేంద్రాల్లో టెక్నాలజీ అభివృద్ధి దృష్టి గ్రామీణ ప్రాంతాలపై ఉంటుంది. ఫుడ్ ప్రాసెసింగ్, ఇంధన ఉత్పత్తి (బయోమాస్‌తో నడిచే విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు), ఎథనాల్ ఉత్పత్తి, రసాయినిక పరిశ్రమలకు ముడిపదార్థాల ఉత్పత్తి, వ్యర్థ పదార్థాల పునర్వినియోగం వంటివాటిపై దృష్టి పెడతారు. అది గ్రామీణ ఉపాధి పెంచుతుంది. దీంతోపాటు ఉపాధి సామర్థం హెచ్చుగా ఉండే చిన్న, సూక్ష్మ పరిశ్రమల అభివృద్ధికి కచ్చితమైన ప్రణాళిక ఉండాలి. మరోవైపున వ్యవసాయ బహుముఖీకరణ, వ్యవసాయాధార పరిశ్రమలను పెద్ద ఎత్తున ప్రోత్సహించాలి. ఇక్కడ నిపుణ కార్మికులు ఉపాధి పొందుతారు. ప్రభుత్వం మొదలుపెట్టిన నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాన్ని ఉపాధి కల్పనతో, పారిశ్రామిక ఔత్సాహికులను ప్రోత్సహించటంతో జత చేయాలి. ఆర్థిక తోడ్పాటు లేక ప్రస్తుతం మూలనపడిన ఉమ్మడి సేవా కేంద్రాలను పునరుద్ధరించి కనీసం 4050 శాతం గ్రామాలకు విస్తరించాలి.

క్షేత్రస్థాయి వాస్తవాల అవగాహనలేని రాజకీయ భాషణ వల్ల ప్రయోజనం లేదు. అంతేగాక నగరాల్లో ఎలక్ట్రానిక్స్, ఐటి రంగాల్లో కొన్ని ఉద్యోగాలు సృష్టించటం లక్షలాదిమంది టెక్నీషియన్స్, ఇంజినీర్లు, నిపుణ నిరుద్యోగుల ఉపాధి అవసరాల్లో మార్పు తీసుకురాదు. దృష్టి దిగువ నుంచి ఉండాలి, గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి కేంద్రాలు కావాలి. ఉపాధి కల్పనకు వాటి పునరుజ్జీవనం కీలకం.

                                                                                                                                     –  ధూర్జటి ముఖర్జీ

Comments

comments