వివాహిత మహిళ అదృశ్యం…

Married Women Missing In Sangareddy District

కోహీర్ ః పొరుగు వారు పిలిచారు ఇదిగో వస్తాను అని చెప్పి వెళ్లిన ఆ వివాహిత మహిళ కానరాకుండా పోయిన సంఘటన మండలంలోని చింతల్‌ఘట్ గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ రాము కథనం ప్రకారం… గ్రామానికి చెందిన గంగ్‌వాడ సంమేశ్వర్‌రెడ్డి సతీమణి గంగ్‌వాడ శిరీష (23) ఈ నెల 7వ తేదిన పొరుగువారు పిలిచారు ఇదిగో వస్తానని ఇంట్లో వారికి చెప్పి వెళ్లిన శిరీష తిరిగిరాకుండా పోయింది. శిరీష ఎంతకూ ఇంటికి తిరిగి రాకపోవడంతో గ్రామంతో పాటు బంధువుల ఇంట్లో ఆచూకి కోసం వెతికినా ఫలితం లేకుండా పోయింది. భర్త సంగమేశ్వర్‌రెడ్డి ఫిర్యాదు మేరకు ఆదివారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వివరించారు.

Comments

comments