వివాహిత ఆత్మహత్యాయత్నం.. కాపాడిన జాలర్లు

ధర్మపురి: ఇంటి ఆర్థిక పరిస్థితుల భారంతో మనస్థాపానికి గురైన ఓ వివాహిత గోదావరి నదిలో దూకి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. అక్కడే చాపలు పడుతున్న జాలర్లు తక్షణమే ఆమెను కాపాడి దవాఖానకు తరల్లించారు. స్థానికుల కథనం ప్రకారం…  లక్షెట్టిపేట మండలం, రాంపూర్ గ్రామానికి చెందిన కళ్యాణి(23)కి, జగిత్యాల జిల్లా గొల్లపెల్లి మండలం బొంకూర్ గ్రామానికి చెందిన కనపర్తి ప్రవీణ్‌ రావుతో గత ఐదు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. గత సంవత్సరం నుండి భర్త ప్రవీణ్‌రావు ఆనారోగ్యానికి […]

ధర్మపురి: ఇంటి ఆర్థిక పరిస్థితుల భారంతో మనస్థాపానికి గురైన ఓ వివాహిత గోదావరి నదిలో దూకి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. అక్కడే చాపలు పడుతున్న జాలర్లు తక్షణమే ఆమెను కాపాడి దవాఖానకు తరల్లించారు. స్థానికుల కథనం ప్రకారం…  లక్షెట్టిపేట మండలం, రాంపూర్ గ్రామానికి చెందిన కళ్యాణి(23)కి, జగిత్యాల జిల్లా గొల్లపెల్లి మండలం బొంకూర్ గ్రామానికి చెందిన కనపర్తి ప్రవీణ్‌ రావుతో గత ఐదు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. గత సంవత్సరం నుండి భర్త ప్రవీణ్‌రావు ఆనారోగ్యానికి గురై మంచానికే పరిమితం అయ్యాడు. దీంతో ఇంటి పోషణ బాధ్యతలు కళ్యాణిపై పడ్డాయి. భర్త అనారోగ్యంతో పాటు ఇంటి ఆర్థిక పరిస్థితులతో తీవ్ర మనస్థాపానికి గురైన కళ్యాణి, శుక్రవారం రాయపట్నం కొత్త బ్రిడ్జిపై నుంచి గోదావరి నదిలో దూకింది. కొద్ది దూరంలోనే చేపలు పడుతున్న జాలర్లు ఆమెను గమనించి బల్లపై ఈదుకుంటూ వెళ్లి కళ్యాణిని కాపాడి ఒడ్డుకు చేర్చారు. నీళ్లు ఊపరితిత్తుల్లోకి వెళ్ళి అస్వస్తతకు గురైన కళ్యాణిని చికిత్స కోసం జగిత్యాల ఏరియా దవాఖానకు తరలించారు.

Related Stories: