వివాహిత అనుమానాస్పద మృతి!

Married Woman Died under Suspicious Circumstances in Nirmal District

నిర్మల్: జిల్లాలోని మామడ మండలం గాయిద్‌పల్లిలో ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. గ్రామ శివారులోని వ్యవసాయబావిలో మహిళ మృతదేహాన్ని గుర్తించారు. అయితే, అత్తింటి వారే మహిళ మృతికి కారణమని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. నిందితులను పట్టుకోవాలంటూ బంధువులు ఆందోళన చేస్తున్నారు. తమకు న్యాయం చేసే వరకు మృతదేహం కదిలించేదిలేదని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.