విరిగిన రైల్వేట్రాక్.. నిలిచిపోయిన రైళ్ల రాకపోకలు

మనోహరాబాద్: మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం పాలాట రైల్వే స్టేషన్ వద్ద రైలు పట్టా విరగడంతో పలు రైళ్ల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. రైల్వేట్రాక్ విరిగిన విషయాన్ని గుర్తించిన స్థానికులు గేట్‌మెన్‌కు సమాచారం ఇవ్వడంతో వెంటనే అప్రమత్తమైన గేట్‌మెన్ అధికారులకు సమాచారం అందించాడు. దాంతో ఆ మార్గంలో వెళ్లే రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. వెంటనే రైల్వే సిబ్బంది అక్కడకు చేరుకుని మరమత్తులు చేపట్టారు. రైల్వేట్రాక్ విరగడాన్ని ముందే గుర్తించడంతో పెను ప్రమాదం తప్పింది. Comments comments

మనోహరాబాద్: మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం పాలాట రైల్వే స్టేషన్ వద్ద రైలు పట్టా విరగడంతో పలు రైళ్ల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. రైల్వేట్రాక్ విరిగిన విషయాన్ని గుర్తించిన స్థానికులు గేట్‌మెన్‌కు సమాచారం ఇవ్వడంతో వెంటనే అప్రమత్తమైన గేట్‌మెన్ అధికారులకు సమాచారం అందించాడు. దాంతో ఆ మార్గంలో వెళ్లే రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. వెంటనే రైల్వే సిబ్బంది అక్కడకు చేరుకుని మరమత్తులు చేపట్టారు. రైల్వేట్రాక్ విరగడాన్ని ముందే గుర్తించడంతో పెను ప్రమాదం తప్పింది.

Comments

comments