విరాట్ కోహ్లీ ఖాతాలో మరో ఘనత…

సౌతాంప్టన్ : ఇంగ్లండ్ తో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో రికార్డును బద్దలు కొట్టాడు. అండర్సన్ బౌలింగ్ లో ఫోర్ కొట్టిన విరాట్… టెస్టుల్లో 6వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. భారత్ ఆటగాళ్లలో 119 ఇన్నింగ్స్ లలో ఈ ఘనతను సాధించి మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ (120)ను వెనక్కి నెట్టేశాడు కోహ్లీ. 117 ఇన్నింగ్స్‌లలోనే 6 వేల పరుగుల మైలు రాయిని చేరుకున్న సునీల్ గవాస్కర్ ఈ జాబితాలో ముందుండగా, […]

సౌతాంప్టన్ : ఇంగ్లండ్ తో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో రికార్డును బద్దలు కొట్టాడు. అండర్సన్ బౌలింగ్ లో ఫోర్ కొట్టిన విరాట్… టెస్టుల్లో 6వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. భారత్ ఆటగాళ్లలో 119 ఇన్నింగ్స్ లలో ఈ ఘనతను సాధించి మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ (120)ను వెనక్కి నెట్టేశాడు కోహ్లీ. 117 ఇన్నింగ్స్‌లలోనే 6 వేల పరుగుల మైలు రాయిని చేరుకున్న సునీల్ గవాస్కర్ ఈ జాబితాలో ముందుండగా, రెండో స్థానంలో కోహ్లీ నిలిచాడు.  ప్రపంచ వ్యాప్తంగా ఈ ఘనతలను సాధించినవారిలో డాన్ బ్రాడ్ మన్ అగ్రస్థానంలో ఉన్నారు. ఆయన కేవలం 68 ఇన్నింగ్స్ లలోనే ఈ ఘనతను సాధించారు.