విరసం నేత వరవరరావు ఇంట్లో తనిఖీలు

Police Checks in Virasam Leader Varavara Rao Home

హైదరాబాద్ : విరసం నేత వరవరరావు ఇంట్లో మహారాష్ట్ర పోలీసులు మంగళవారం తనిఖీలు చేశారు. మోడీని హత్య చేసేందుకు మావోయిస్టులు ప్రణాళిక రూపొందించినట్టు ఇటీవల వార్తలు వచ్చాయి. ఈ కుట్ర కేసులో వరవరరావు పేరు ఉంది. దీంతో గాంధీనగర్‌లోని వరవరరావు ఇంటితో సహా హైదరాబాద్‌లోని నాలుగు చోట్ల మహారాష్ట్ర పోలీసులు తనిఖీలు చేశారు. అంతేకాకుండా బిజినెస్ లైన్ రిపోర్టర్ కూర్మనాథ్, వరవరరావు చిన్న కూతురు ఇంట్లో సైతం పోలీసులు తనిఖీలు చేశారు. ప్రధాని మోడీని హత్య చేసేందుకు జరిగిన కుట్రలో వరవరరావు పాత్ర ఉందని మహారాష్ట్ర పోలీసులు తెలిపారు. ఈ కుట్రలో భాగంగా ఆపరేషన్‌కు వరవరరావు నిధులు సమకూర్చినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.

Police Checks in Virasam Leader Varavara Rao Home

Comments

comments